'క్రిష్-3' చిత్రం కథను కాపీ కొట్టినందుకు బాలీవుడ్ చిత్ర నిర్మాత రాకేష్ రోషన్‌పై ముంబైలో కేసు నమోదైంది. ఈ చిత్రంలో హీరోగా హృతిక్ రోషన్ నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా కథను సూఅర్దాన్ అనే నవల నుంచి కాపీ కొట్టారంటూ రచయిత రూప్ నారాయణ్ సోంకార్ రాకేశ్‌పై కాపీరైట్ చట్టం కింద కేసు పెట్టారు. తాను రాసిన సూఅర్దాన్ పుస్తక కాపీలను కూడా పోలీసులకు అందజేశారు.
కాగా, 2013లో వచ్చిన క్రిష్ సినిమాలో కూడా అచ్చం ఇలాంటి పాత్రే ఉంటుందని, తన అనుమతి లేకుండా తన కథను వారు కాపీ కొట్టారని రచయిత ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ముంబై పోలీసులు రాకేశ్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయమై రాకేశ్‌ని మీడియా ప్రశ్నిస్తే ప్రస్తుతం కేసు విచారణలో ఉందని దీనిపై ఏం మాట్లాడలేనని మెసేజ్ ద్వారా సమాధానమిచ్చారు.