ఒక సినిమాలో నటించడానికి నటుడికి నిర్మాతలు రూ.670 కోట్లు పారితోషికాన్నిఆఫర్ చేశారు. కానీ ఆ హీరో ఆ సినిమా చేయనని అన్నాడంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది కదూ. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు జేమ్స్ బాండ్ హీరో డేనియల్ క్రెయిగ్. జేమ్స్ బాండ్ సిరీస్ కొత్త సినిమాలో నటించేందుకు అంత భారీ స్థాయిలో పారితోషికం ఆఫర్ చేసినా కూడా ససేమిరా కుదరదని తేల్చిచెప్పేశాడట.
జేమ్స్ బాండ్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన హీరో డేనియల్ క్రెయిగ్, దాదాపు పదేళ్ళ కిందట వచ్చిన 'క్యాసినో రాయల్స్' చిత్రంతో జేమ్స్ బాండ్ సినిమాలు మొదలు పెట్టాడు. ఇప్పటివరకు నాలుగు సిరిస్‌లు చేసిన డేనియల్ క్రెయిగ్ తాజాగా మరో బాండ్ చిత్రం చేయడానికి నిరాకరించాడట. నిజానికి జేమ్స్ బాండ్ చిత్రాలే ఇతడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఇకపై జేమ్స్ బాండ్ సినిమాలు చేయనని క్రెయిగ్ చెప్పేశాడు.
గతేడాది వచ్చిన జేమ్స్ బాండ్ చివరి సిరిస్ 'స్పెక్టర్' ప్రమోషన్‌లో క్రెయిగ్ మాట్లాడుతూ... "జేమ్స్ బాండ్ సినిమాలు చేయడం కంటే చనిపోవడం మేలు అని చెప్పిన డేనియల్ ఇక నుండి జేమ్స్ బాండ్ చిత్రాల్లో నటించను అని చెప్పారు. మరి జేమ్స్ బాండ్ చిత్రాలు తీసే ఎం.జి.ఎం సంస్థ మాత్రం తాజాగా మరో జేమ్స్ బాండ్ చిత్రానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో హీరోగా నటించడానికి డేనియల్‌కు 99 డాలర్స్ అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో రూ.670 కోట్లు ఇస్తామన్న జేమ్స్ బాండ్ సినిమాలు చేయలేనని చెప్పాడట. మరి ఎంజీఎం సంస్థ అతడిని ఒప్పించగలుగుతుందా లేదా మరో కొత్త జేమ్స్ బాండ్ హీరో కోసం వెతుకుతుందా అని వేచి చూడాల్సిందే.