Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిత్రపురి కాలనీలోని స్కూల్ విషయంలో డి.సురేష్ బాబు కు ఎదురుదెబ్బ !

Advertiesment
Chitrapuri Colony school

డీవీ

, బుధవారం, 19 జూన్ 2024 (16:28 IST)
Chitrapuri Colony school
గత కొన్నేళ్ళుగా చిత్రపురి కాలనీలోని ఎల్.ఐ.జి.లో పర్మిషన్ లేకుండా కట్టిన కాంప్లెక్స్ నిరుపయోగంగా పడివుంది. దానికోసం కోట్ల రూపాయల బ్యాంక్ లోన్ కట్టేందుకు జాప్యం చేయడంతో జప్తు చేయడానికి అధికారులు సిద్ధమయినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆ కాంప్లెక్స్ ను చిత్రపురి స్కూల్ గా మార్చేసి పదవ తరగతి లోపు పిల్లలను ఆ కాలనీలోని పిల్లలను జాయిన్ చేయించేలా ప్రస్తుత సొసైటీ అధ్యక్షుడు, అనిల్ వల్లభనేని కుమార్ నిర్ణయం తీసుకున్నారు. 
 
webdunia
colony warriors with MEO
ఎక్కడో కార్పొరేట్ స్కూల్ లో ఫీజులు ఇచ్చుకోలేక చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను చిత్రపురి స్కూల్ లో జాయిన్ చేశారు. అయితే అక్కడ అర్హతలేని టీచర్లు, సరైన సిబ్బంది లేకపోవడంతో స్కూల్ పిల్లల చదువు ఎండమావిగా మారిపోయింది. దీని గురించి తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపాల్ ను అడిగినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయాన్ని వారంతా  కాలనీలోని ఓనర్స్ అసోసియేషన్ సొసైటీకి విన్నవించడం, వారు సొసైటీ ప్రతినిధులను అడగడం జరిగింది .అయినా స్కూల్ లో మార్పు లేదు. 
 
ఇక ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు స్కూల్ గురించి నిశితంగా పరిశీలించడంతో కొన్ని నిజాలు బయటపడ్డాయి.  కాలనీలో వేలాదిమంది నివశించే ప్రాంతంలో కమర్షియల్ స్కూల్ పెట్టడం సొసైటీ రూల్స్ కు బైలాస్ కు విరుద్ధంగా జరిగింది. కనీసం జనరల్ బాడీలో స్కూల్ గురించి చెప్పకుండా ఎడ్యుకేషన్ కమిటీ కూడా వేయకుండా ఏకచత్రాధిపత్యంగా అనిల్ వ్యవహరించారని సొసైటీ సభ్యులే అంగీకరిచడంతో ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. 
 
దానితో, ఈ కాంప్లెక్స్ స్కూల్ పై కాలనీవాసులు చేసిన ఫిర్యాదు మేరకు ఎం.ఇ.ఒ. నిన్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ  సభ్యుడు, స్కూల్ బాధ్యతలు చేపట్టిన కొొంగర రామక్రిష్ణను ఎం.ఇ.ఓ. వివరాలు అడగడంతో ఆయన నాడ్చుడుధోరణిగా వ్యవహరించడం విశేషం. పైగా స్కూల్ విషయంలో తప్పులు జరిగిన మాట వాస్తవమే అని అంగీకరించడం కొసమెరుపు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూల్ గురించి అంతా తెలిసి దాన్ని ఏదోవిదంగా వేరే వారికి అంటగట్టాలని  ఒకప్పటి సొసైటీలోని కమిటీ సభ్యులు కీలకమైన వ్యక్తి అయిన భరద్వాజ, డి.సురేష్ బాబుకు చెందిన విజ్జానజ్యోతికి అప్పగించేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇవేవీ పట్టించుకోని సురేష్ బాబు వ చ్చే ఏడాది తమ స్కూల్ లో కలిపేస్తామని అన్నట్లు సమాచారం.
 
ఈ సందర్భంగా అన్ని వివరాలు తెలుసుకున్న ఎం.ఇ.ఓ. పలు కీలక నిర్ణయాలు తీసుకుని అక్కడి బాధ్యుడైన కొంగరకు వార్నింగ్ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడినందున అవసరమైతే  పర్మిషన్ క్యాన్సల్ చేస్తాం అని చెప్పారు. విజ్ఞాన జ్యోతి గానీ మరే ఇతర సంస్థ కు స్కూల్ అప్పగించము..ఒకవేళ చేతగాకపోతే  ఎల్.ఐ.జి. అండ్ ఇ.డబ్ల్యు.సి. ఓనర్స్ అసోసియేషన్ కు అప్పగించాలని ఒక వారం రోజుల్లో  అధికారిక  ప్రకటన చేయాలని MEO సూచించారు
 
ఈ స్కూల్ ప్రజల అందరి ఆస్తి. మీరు మీ స్వంత నిర్ణయాలు చేస్తే ప్రజలు తిరగబడితే మాకు పిర్యాదులు వస్తె స్కూల్ మూయడం తప్ప మరో మాగర్లం లేదని  కొంగర రామకృష్ణ కు ఎం.ఇ. ఓ. వార్నింగ్ ఇచ్చారు
 
అంతేగాక స్కూల్ కమిటీ ఏదీ..? వాళ్లకు చెప్పకుండా ఎలా స్కూల్ నడుపుతారు అని ప్రశ్నించారు. వెంటనే అన్ని కమిటీలు వేసి పేర్లు  ప్రకటించాలి ...అని MEO సలహా ఇచ్చారు.  కమిటీల భాగస్వామ్యం, సంతకాలు లేనిదే ఏ నిర్ణయమూ చెల్లదు అని ఉద్ఘాటించారు.
 
చిత్రపురి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు ఉన్నా దానిలోని సభ్యులను అంటే అభ్యంతర పరిస్థితులు వారివలన ఉంటే సభ్యులను మార్చి...స్కూల్ నడపాలి అనీ చెప్పి చిత్రపురి ఎడ్యుకేషనల్ సొసైటీ by - law అందరికీ అందుబాటు లో ఉంచండి అని సూచించారు..పారదర్శకత లేకుంటే అది పిర్యాదు గా మారితే చివరికి స్కూల్ మూతపడటమే పరిష్కారం అవుతుందని, సొసైటీ పాలక సభ్యులు దానికి కారణం అవుతారు..అని తేల్చి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మన వద్ద కూడా మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వస్తున్నాయి : దర్శక నిర్మాత రాజేష్ జగన్నాథం