Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరంజీవితో వైకాపా ఎమ్మెల్యే రోజా ఇంటర్వ్యూ... ఫన్ అండ్ స్టన్ క్వచ్చన్స్...?

రాజకీయాల్లో వారిద్దరు ప్రత్యర్థులు. రాజకీయాల్లో ఉన్నంతవరకు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. తెరవెనుక జరిగిన వ్యక్తిగత విషయాలు సైతం బహిరంగ పరుచుకున్నారు.

చిరంజీవితో వైకాపా ఎమ్మెల్యే రోజా ఇంటర్వ్యూ... ఫన్ అండ్ స్టన్ క్వచ్చన్స్...?
, మంగళవారం, 10 జనవరి 2017 (14:15 IST)
రాజకీయాల్లో వారిద్దరు ప్రత్యర్థులు. రాజకీయాల్లో ఉన్నంతవరకు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. తెరవెనుక జరిగిన వ్యక్తిగత విషయాలు సైతం బహిరంగ పరుచుకున్నారు. వీరిద్దరిలో ఒకరు రాజకీయాలకు స్వస్తి చెప్పి మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు. మరొకరు రాజకీయాల్లో  కొనసాగుతూ.. బుల్లితెర కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరు ఇపుడు మళ్లీ ముఖాముఖీగా తలపడనున్నారు. వారిద్దరే మెగాస్టార్ చిరంజీవి కాగా మరొకరు నటి, వైకాపా ఎమ్మెల్యే, 'జబర్దస్త్' ఫేం ఆర్కే రోజా.
 
ఈ సంక్రాంతి బరిలో చిరంజీవి నటించిన చిత్రం "ఖైదీ నంబర్ 150" విడుదల కానుంది. ఈచిత్రం ప్రమోషన్‌ వివిధ రకాలుగా చేస్తున్నారు. అదేసమయంలో పెద్ద సినిమాలు రిలీజయ్యే సమయంలో వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటు ఎలక్ట్రానిక్ మీడియా బిజీగా మారడం చూస్తూనే ఉన్నాం. 
 
ఇందులోభాగంగా, సంక్రాంతికి రిలీజయ్యే చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ కోసం సాక్షి టీవీ ఛానెల్ ఓ ఫన్ ఇంటర్వ్యూ చేసిందట. ఈ ఇంటర్వ్యూను వైసీపీ ఎమ్మెల్యే రోజా చేయడం గమనార్హం. చిరంజీవితో వన్ టు వన్ ఇంటర్వ్యూ కోసం ఆమెనే సాక్షి ప్రయోగించింది. ఈ ముఖాముఖి ఇంటర్వ్యూలో కేవలం "ఖైదీ" సినిమా విశేషాలపై రోజా ప్రశ్నలు సంధిస్తారా? లేక నాటి రాజకీయాలతో పాటు తమపై చేసిన ఆరోపణలపై కూడా ప్రశ్నలు సంధిస్తారా అన్నది ఇపుడు ఆసక్తిగా మారింది. నిజానికి చిరంజీవితో రోజా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ఇంకోవైపు చిరంజీవి 2019 ఎన్నికల నాటికి పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతోంది. అది కూడా వైసీపీ లోకి జంప్ అవుతారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో చిరును ఎమ్మెల్యే రోజా ఇంటర్వ్యూ చేయడం ఆసక్తికరంగా మారింది.
webdunia
 
మరోవైపు... టీవీ9 సీఈవో రవిప్రకాష్‌కు చిరంజీవి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అడిగిన ప్రశ్నలకు చిరు చాలా క్లారిటీతో సమాధానాలిచ్చారు. సుధీర్ఘంగా సాగిన ఇంటర్వ్యూలో ఆశ్చర్యకరమైన సమాధానాలు లేనప్పటికీ వివాదాస్పదమైన అనేక విషయాలపై అడిగిన ప్రశ్నలకు చిరంజీవి సూటిగా సమాధానాలిచ్చారు.
 
ప్రీరిలీజ్ ఫంక్షన్లో నాగబాబు, రామ్ గోపాల్ వర్మ, యండమూరిపై చేసిన వ్యాఖ్యలు, సినిమా షూటింగ్ సమయంలో వివి వినాయక్ పనికి అడ్డుతగిలారన్న వాటిపై సంధించిన ప్రశ్నలకు.. విజయవాడలో ఫంక్షన్‌కు అనుమతి నిరాకరించిన అంశానికి, పవన్ కళ్యాణ్ మీద సంధించిన ప్రశ్నలకు చిరంజీవి చాలా కూల్‌గా సమాధానాలు చెప్పడం విశేషం. 
 
ఎవరిమీదా తీవ్రమైన విమర్శలుగాని, వ్యాఖ్యలుగాని చేయకుండా, తన సహజధోరణికి భిన్నంగా.. మాటలకు తడుముకోకుండా.. తడబడకుండా ప్రశాంత వదనంతో ఎలాంటి ఆవేశానికి, ఉద్వేగాలకు లోనుకాకుండా ఇంటర్వ్యూని రక్తి కట్టించాడు. అటు ప్రజారాజ్యం, యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాల మీద, కాపురిజర్వేషన్ల అంశంమీదా అడిగిన ప్రశ్నలకు కూడా ఎలాంటి తత్తరపాటు లేకుండా చిరు సమాధానాలిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అభిమానం వేరు.. మూర్ఖాభిమానం వేరు... సంక్రాంతి చిత్రాల మధ్య యుద్ధం లేదు : క్రిష్