Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అభిమానం వేరు.. మూర్ఖాభిమానం వేరు... సంక్రాంతి చిత్రాల మధ్య యుద్ధం లేదు : క్రిష్

ఈ సంక్రాంతికి గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ యుద్ధం మొదలైంది. దీనికి కారణం ఇద్దరు అగ్రహీరోల చిత్రాలు విడుదల కానుండటమే. వీటిలో ఒకటి చిరంజీవి నటించిన "ఖైదీ నంబర్ 150" కాగా, మరొకటి బాలకృష్ణ నటించిన "గౌతమి

అభిమానం వేరు.. మూర్ఖాభిమానం వేరు... సంక్రాంతి చిత్రాల మధ్య యుద్ధం లేదు : క్రిష్
, మంగళవారం, 10 జనవరి 2017 (13:58 IST)
ఈ సంక్రాంతికి గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ యుద్ధం మొదలైంది. దీనికి కారణం ఇద్దరు అగ్రహీరోల చిత్రాలు విడుదల కానుండటమే. వీటిలో ఒకటి చిరంజీవి నటించిన "ఖైదీ నంబర్ 150" కాగా, మరొకటి బాలకృష్ణ నటించిన "గౌతమిపుత్ర శాతకర్ణి". ఈ రెండు కేవలం ఒక్క రోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకురానున్నాయి. 
 
కానీ, ఈ రెండు చిత్రాల మధ్య యుద్ధం అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంతో మెగా, నందమూరి అభిమానులు కాస్త ఉత్కంఠకి లోనవుతున్నాయి. దీంతో ఈ పరిణామాలు ఎటు వైపు దారితీస్తాయన్న టెన్షన్ తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. అయితే, ఈ యుద్ధంపై నీళ్లు చల్లి.. అసలు విషయాలని విడమర్చి చెప్పే ప్రయత్నం శాతకర్ణి దర్శకుడు క్రిష్ చేశారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ "అభిమానం వేరు. మూర్ఖాభిమానం వేరు. సంక్రాంతి చిత్రాల మధ్య ఎలాంటి యుద్ధం జరగడం లేదని" స్పష్టం చేశారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి 'ప్రారంభానికి బాలకృష్ణ చిరంజీవిని ఆప్యాయంగా ఆహ్వానించారు. చిరంజీవిగా విచ్చేసి. శుభాకాంక్షలు కూడా అందజేశారు. ఇప్పుడు తమ అభిమాన హీరో చిరు అందజేసిన శుభాకాంక్షలు అబద్ధం అవ్వాలని కోరుకోకూడదు. అలాగే.. నిజమైన బాలకృష్ణ అభిమానులు శుభాకాంక్షలు అందజేసిన చిరంజీవి సినిమా పట్ల అమర్యాదపూర్వకంగా ప్రవర్తించకూడదు అంటూ చెప్పుకొచ్చారు. మరీ.. క్రిష్ సూచనలని మెగా, నందమూరి అభిమానులు ఏ మేరకు పాటిస్తారన్నది చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోటీ ఉండాలి... పోటీ లేకుంటే చప్పగా ఉంటుంది : చిరంజీవికి బాలకృష్ణ కౌంటర్