Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Advertiesment
Ram Prakash Gunnam, Sreejith, Nishkala, Ramya

దేవీ

, మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (16:17 IST)
Ram Prakash Gunnam, Sreejith, Nishkala, Ramya
రామ్ ప్రకాష్ గున్నం హీరోగా దర్శకుడిగా శ్రీజిత్, నిష్కల, రమ్య తదితరులు నటించిన చిత్రం ‘చెరసాల’. కథ్రి అంజమ్మ, షికార నిర్మాతలు. ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్ మీద కథ్రి అంజమ్మ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదలవుతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ చిత్రం గురించి పలు విషయాలు వివరించారు.
 
webdunia
Charasala team
డైరెక్టర్, హీరో రామ్ ప్రకాష్ గున్నం మాట్లాడుతూ .. ‘మంచి కాన్సెప్ట్‌తో చెరసాల చిత్రం రాబోతోంది. ఓ బంధం ఎలా ఉండాలి? రిలేషన్ షిప్‌లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అనే పాయింట్‌ను చూపించాను. మంచి ఎమోషన్స్‌తో పాటుగా చక్కని వినోదం కూడా ఉంటుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా మా చెరసాల చిత్రం ఉంటుంది. మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.
 
మరో హీరో శ్రీజిత్ మాట్లాడుతూ,  తెలుగులోనే డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నించాను. కానీ కుదరలేదు. సినిమా అద్భుతంగా వచ్చింది. మా దర్శకుడు ఈ చిత్రం మీద నాలుగేళ్లు ఫోకస్ పెట్టాడు. మధ్యలో ఇతర ఆఫర్లు వచ్చినా కూడా మా సినిమా మీదే దృష్టి పెట్టాడు. నేను కన్నడలో ఇది వరకు సినిమాలు చేశాను. నన్ను నమ్మి మా దర్శకుడు నాకు అవకాశం ఇచ్చారు. ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని రావాలి  అని అన్నారు.
 
హీరోయిన్ నిష్కల మాట్లాడుతూ, ఇది నాకు తెలుగులో తొలి చిత్రం. ఇందులో నేను ప్రియ అనే అద్భుతమైన పాత్రను పోషించాను. ఇంత మంచి సినిమాలో పని చేయడం ఆనందంగా ఉంది. డైరెక్టర్ రామ్ ప్రకాష్ అద్భుతంగా మలిచారు. మేం కష్టపడి, ఇష్టపడి సినిమాను చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది అని అన్నారు.
 
నటి రమ్య మాట్లాడుతూ .. ‘చెరసాల సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. మా చిత్రం ఏప్రిల్ 11న రాబోతోంది. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
 
కథా రచయిత ఫణీంద్ర భరద్వాజ్ మాట్లాడుతూ, ఓ అమ్మాయి తన భర్త కోసం, మాంగళ్యాన్ని కాపాడుకునేందుకు పడే తపనే ఈ కథ. ఈ చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని అన్నారు.
 
ఎడిటర్ భాను నాగ్ మాట్లాడుతూ .. ‘నాకు దర్శకుడితో ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఈ చెరసాల చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్