Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు లాభంలేదని చెన్నై వెళ్ళిపోయా : గెటప్ శ్రీను

Getup Srinu

డీవీ

, గురువారం, 23 మే 2024 (16:35 IST)
Getup Srinu
బుల్లితెరలో జబర్ దస్త్ ప్రోగ్రామ్ ద్వారా వెలుగులోకి వచ్చిన త్రయం ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను. వీరు మంచి స్నేహితులు కూడా. వీరిలో సుడిగాలి సుధీర్, గెటప్ శీను హీరోలుగా ట్రై చేశారు. తాజాగా గెటప్ శీను కథానాయకుడిగా నటించిన సినిమా రాజు యాదవ్. ఈ సినిమా రేపు థియేటర్లలో విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా ఆయనతో వెబ్ దునియా స్పెషల్ చిట్ చాట్.
 
webdunia
Getup Srinu
బుల్లితెర కమల్ హాసన్ అని పేరు మీరు పెట్టుకున్నారా? ఎవరైనా ఇచ్చారా?
 
(నవ్వుతూ...) నా పేరు శీను. నటుడిగా పలు షేడ్స్ చూపించాలనే జబర్ దస్త్ లో పలు గెటప్ లు వేయడంతో గెటప్ శీనుగా ఆడియన్స్ మార్చేశారు. సోషల్ మీడియా ఎక్కువయ్యాక నా హావభావాలు చూసి బుల్లితెర కమల్ హాసన్ గా మార్చేశారు. నాకు ఈ పేర్లేమి పెద్దగా ఇష్టం వుండదు. శీను అంటే నాకు చాలా హ్యాపీ.
 
సినిమారంగంలో వెళుతున్నానంటే ఇంట్లోవారు ఏమనేవారు? ఇప్పుడు ఏమంటున్నారు?
 
మొదట్లో ఇంట్లో వారికి ఇష్టం లేదు. పెద్ద రికమండేషన్ లు, బ్యాక్ బోన్ లు వుంటేనే ఇండస్ట్రీలో రాణిస్తారని మా వారు అనేవారు. నేను కొన్నాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాను. నాలో నటుడి తపన తగ్గలేదు. ఎలాగైనా సరే చెన్నై వెళ్ళి అక్కడ తమిళ్ నేర్చుకుని ఇరగ దేసేద్దాం అనుకున్నా.  కానీ అక్కడ ఎందుకనే ఇమడలేకపోయాను. తిరిగి వచ్చేసా.. ఆ తర్వాత వచ్చిన అవకాశమే జబర్ దస్త్. ఆ తర్వాత మీకు తెలిసిందే. నేను ఇప్పుడు ఈ స్థాయిలో వుండడం మా పెద్దలు చూసి సాధించావ్ రా.. అంటూ ఆప్యాయంతోకూడిన ప్రేమ కురిపిస్తారు.
 
బుల్లితెరలో త్రయంగా వున్న మీరు త్రీ మంకీస్ చేసి ఫెయిల్ అయ్యారు? మరి కసితో మరో ప్రయత్నం చేయాలనిపించలేదా?
తప్పకుండా వుంది. ఇటీవలే ఆటో రాంప్రసాద్ కలిసినప్పుడు మంచి కథను సిద్ధం చేస్తున్నా. మళ్ళీ మనం ముగ్గురం కలిసి నటించాలి అన్నాడు. దర్శకత్వం కూడా మాలో ఒకరు చేస్తారేమో ఇప్పుడే చెప్పలేను.
 
రాజుయాదవ్ పాత్ర చేసేటప్పుడు కష్టపడిన సందర్భం ఏదైనా వుందా?
రాజు యాదవ్ పాత్ర లక్ష్మిపతి అనే క్రికెటర్ ను బేస్ చేసుకుని దర్శకుడు రాశాడు. ఆయనకు దవడలవల్ల చిన్న ఆపరేషన్ చేశారు. దాంతో ఎప్పుడూ నవ్వుతున్నట్లే అనిపిస్తుంది. అలాంటి పాత్ర నేను చేయాలి. పెదాలనుంచి ముక్కువరకు ఎటువంటి ఎక్స్ ప్రెషన్ చూపించకూడదు. కళ్ళు నొసలు, బుగ్గలతో వేరియన్స్ చూపించాలి. చాలాసార్లు అలా చేస్తున్నప్పుడు దవడలు షివర్ అయ్యేయి. అమ్మో ఇన నేను ఇలాంటి నటనకు పనికిరానేమోనని భయం వేసింది. ఉదయం షాట్ మొదలు పెడితే సాయంత్రం వరకు అలాంటి ఫీలింగ్ పేస్ లో చూపించాలి. ఓ దశలో అనసరంగా ఒప్పుకున్నానేమో అనిపించేది.
 
హీరోగా రాజుయాదవ్ ఎలా వుండబోతోంది?
నన్ను హీరో అనకండి. అలా అనిపించుకోవడం ఇష్టం లేదు. నేను కథలో లీడ్ రోల్ చేశానంతే. ముందుముందు అవసరమైతే క్యారెక్టర్ లు కూడా చేస్తాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనూప్ రూబెన్స్ చేసిన మనం మ్యూజికల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్