Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను రూ.150 కోట్లు మోసం చేశానా? అడ్వకేట్‌పై సింగర్ మంగ్లీ ఫిర్యాదు

Advertiesment
mangli
తనపై అనేక రకాలైన అసత్య ఆరోపణలు చేసిన న్యాయవాది సుభా సింగబోష్‌పై సినీ గాయకురాలు మంగ్లీ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ.150 కోట్ల మేర మోసం చేశారంటూ తనపై అతను తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చి 21న సుభా సియపోగు పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి తనను బెదిరించాడని వెల్లడించారు. 
 
'అతడు అమర్యాదగా బెదిరించే ధోరణిలో మాట్లాడారు. తనను కలవాలని ఒత్తిడి చేశారు. నిరాకరిస్తే అప్రతిష్ఠ పాలుచేస్తానని బెదిరించారు. మరో వ్యక్తితో కలిసి అవమానకర వ్యాఖ్యలు చేశారు. నాకు ఎలాంటి సంబంధం లేని కరెన్సీ నోట్లు ఉన్న వీడియో చూపించి బెదిరించారు. సుభా సింగబోష్‌ తీరుపై నా కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు' అని మంగ్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 
 
అంతకుముందు మంగ్లీపై అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చారు. తన వద్ద నుంచి గాయని మంగ్లీ రూ.10 కోట్లు తీసుని తిరిగి చెల్లించకుండా మోసం చేశారంటూ ఆరోపించారు. కేవలం తనను మాత్రమే కాకుండా సుమారు 150 మందిని నమ్మించి ఇదే త రహాలో మోసాలకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తిరిగి అడిగినందుకు తనను తీవ్రంగా భయపెట్టారని, నిన్ను చంపి శవం కూడా దొరకకుండా చేస్తాను అంటూ మంగ్లీ నేరుగా బెదిరింపులకు దిగారని సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Singer Mangli: సింగర్ మంగ్లీ, సోదరుడిపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?