క్యాన్సర్ పేషెంట్ల కోసం జుట్టును త్యాగం చేసిన ఛార్మీ.. పొడవాటి జుట్టుతో విగ్గులు చేసి...?!
నటి ఛార్మీ తన పొడవాటి జుట్టును ఉన్నట్టుండి కత్తిరించుకుంది. కత్తిరించిన తన జడను, తన కొత్త షార్ట్ హెయిర్ లుక్‌కు సంబంధించిన ఫోటోలు పోస్టు చేసింది. తాను ఇలా జుట్టు కత్తిరించుకోవడానికి కారణాన్నికూడా వెల్
నటి ఛార్మీ తన పొడవాటి జుట్టును ఉన్నట్టుండి కత్తిరించుకుంది. కత్తిరించిన తన జడను, తన కొత్త షార్ట్ హెయిర్ లుక్‌కు సంబంధించిన ఫోటోలు పోస్టు చేసింది. తాను ఇలా జుట్టు కత్తిరించుకోవడానికి కారణాన్నికూడా వెల్లడించింది ఛార్మీ. పేద క్యాన్సర్ పేషెంట్స్ కోసం విగ్గు తయారీ కోసం తన జుట్టును త్యాగం చేసింది. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడంలో భాగంగానే ఇలా చేశాను అని తెలిపింది.
జుట్టును కత్తిరించుకోవడం అనేది చాలా కష్టమైన నిర్ణయం, నాకు పొడవాటి జుట్టు అంటే ఎంతో ఇష్టం, కానీ నా అందం కంటే క్యాన్సర్ పేషెంట్స్ కోసం డొనేట్ చేయడం అనేది చాలా ముఖ్యం అనిపించిందని ఛార్మీ తెలిపారు. ఇదంతా ఎందుకంటే ఛార్మీ స్నేహితుడు... తన నివాసం సమీపంలో ఉండే ఇద్దరు యువతులకు కేన్సర్ సోకిందని, వారిద్దరూ తన అభిమానులని చెప్పాడట. దీంతో వారిని కలిసి, వారితో కొంత సమయం గడిపిందట ఛార్మీ.
ఆ సమయంలో వారు తన జుట్టు పట్టుకుని, 'అక్కా నీ జుట్టు ఎంత బాగుందో' అని వారిద్దరూ ముచ్చటపడ్డారని ఈ భామ తెలిపింది. దీంతో వారికి అంతగా నచ్చిన తన జుట్టుతో విగ్గులు చేయించాలని భావించానని ఛార్మీ చెప్పింది. తన హెయిర్ స్టైలిస్ట్‌ను పిలిచి, 18 అంగుళాల జుట్టును కత్తిరించి, వారిద్దరికీ విగ్గులు చేయించానని తెలిపింది. త్వరలో వారిద్దరినీ మళ్లీ కలిసి విగ్గులు అందజేస్తానని తెలిపింది. అవి అందజేస్తుండగా వారి కళ్లలో వెలుగులు చూడాలని ఉందని ఛార్మీ వెల్లడించింది.