Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను ఒకేవేదికపై తేనున్న ప్రపంచ తెలుగు సమాఖ్య

Dr. VL Indiradat, Sai, Harish Chandra Prasad

డీవీ

, శనివారం, 26 అక్టోబరు 2024 (10:15 IST)
Dr. VL Indiradat, Sai, Harish Chandra Prasad
1993లో స్థాపించబడిన 'ప్రపంచ తెలుగు సమాఖ్య' దాదాపు ముప్పయి (30) సంవత్సరాలుగా కృషి చేస్తోంది. అందులో భాగంగా తెలుగునాట అనేక కార్యక్రమాలతో పాటు ప్రతి రెండు సంవత్సరాలకొకసారి 'అంతర్జాతీయ తెలుగు మహాసభలు' నిర్వహిస్తూ వస్తోంది. ఇంతవరకు వివిధ రాష్ట్రాలలో, విదేశాలలో పదకొండు ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలు చెన్నై, హైదరాబాదు, ఢిల్లీ, విశాఖపట్నం, సింగపూరు, బెంగళూరు, దుబాయ్, విజయవాడ, మలేసియాలలో, మరల 2018లో చెన్నైలో జరిగాయి.
 
ప్రస్తుతం ప్రపంచ తెలుగు సమాఖ్య 'పన్నెండవ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలను ‘2025 జనవరి 3, 4, 5 తేదీలలో హైదరాబాదులో హైటెక్ సిటీలోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ & హెచ్ఐసిసి కాంప్లెక్స్లో నిర్వహించడానికి భారీ ఎత్తున సన్నాహాలు జరుపుతోంది. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ వి.ఎల్.ఇందిరాదత్ గారి అధ్యక్షతన ఘనంగా జరిగే ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గౌరవ అతిథులుగా ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర మరియు కేంద్రమంత్రులు మరికొందరు వివిధ రంగాల తెలుగు ప్రముఖులు హాజరు అయ్యే అవకాశం ఉంది.
 
ఈ మహాసభల్లో ప్రముఖ తెలుగు పారిశ్రామికవేత్తలను, ఇతర రంగాలకు చెందిన కొందరు తెలుగు ప్రముఖులను సత్కరించడం జరుగుతుంది. ఈ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభల్లో ప్రపంచ తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థల ప్రతినిధుల సమావేశం మరియు వాణిజ్య, పారిశ్రామిక వేత్తల సదస్సులు జరుగుతాయి. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జానపద కళారూపాల ప్రదర్శన, కూచిపూడి నృత్య రూపకాలు, సాహితీ రూపకములు, భాషా, సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలు, సినీకళాకారుల ప్రదర్శనలు, సినీసంగీత విభావరి, తెలుగువారి చేనేత వస్త్ర అందాల ప్రదర్శనలతో పాటు మరికొన్ని ఆసక్తికర కార్యక్రమాలు ఉంటాయి.
 
ఈ మూడు రోజుల అంతర్జాతీయ మహాసభలకు హాజరు కావాలనుకునే తెలుగు భాషాభిమానులు, కళాభిమానులు ముందుగా తమ తమ పేర్లను ప్రతినిధులుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ తెలుగు సమాఖ్య 'వెబ్సైట్'లో ఉంచబడిన ప్రతినిధుల నమోదీకరణ పత్రం (డెలిగేట్ రిజిస్ట్రేషన్ ఫారం) ద్వారా కూడా 'ఆన్లైన్లో' రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
 
ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ వి.ఎల్.ఇందిరాదత్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిని సంఘటిత పరచి, వారిలో సోదరభావం, పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందిస్తూ తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపోషిస్తూ నేటితరం, భావితరాలకు అందించడానికి తగిన సమావేశాలు, చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నది ప్రపంచ తెలుగు సమాఖ్య. ప్రస్తుతం ప్రపంచ తెలుగు సమాఖ్య 'పన్నెండవ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలను ‘2025 జనవరి 3, 4, 5 తేదీలలో హైదరాబాదులో హైటెక్ సిటీలోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ & హెచ్ఐసిసి కాంప్లెక్స్లో నిర్వహించడానికి భారీ ఎత్తున సన్నాహాలు జరుపుతున్నాం. ఈ మహాసభల్లో ప్రముఖ తెలుగు పారిశ్రామికవేత్తలను, ఇతర రంగాలకు చెందిన కొందరు తెలుగు ప్రముఖులను సత్కరించడం జరుగుతుంది. ఈ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభల్లో ప్రపంచ తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థల ప్రతినిధుల సమావేశం మరియు వాణిజ్య, పారిశ్రామిక వేత్తల సదస్సులు జరుగుతాయి. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జానపద కళారూపాల ప్రదర్శన, కూచిపూడి నృత్య రూపకాలు, సాహితీ రూపకములు, భాషా, సంస్కృతులపై ప్రముఖుల ప్రసంగాలు, సినీకళాకారుల ప్రదర్శనలు, సినీసంగీత విభావరి, తెలుగువారి చేనేత వస్త్ర అందాల ప్రదర్శనలతో పాటు మరికొన్ని ఆసక్తికర కార్యక్రమాలు ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుండి మరియు దేశవిదేశాల నుండి సుమారు రెండువేలమంది ప్రతినిధులు ఈ 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభలకు హాజరు కాగలరని ఆశిస్తున్నాము' అన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయాల్లోకి రమ్మంటారా? హీరో సాయి దుర్గ తేజ్ కామెంట్స్..