Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

గ్లామ‌ర్‌తో ఆఫర్లతో బిజీ అయిన చాందిని

Advertiesment
K Bhagyaraj
, గురువారం, 10 మార్చి 2022 (20:24 IST)
Chandini
కె భాగ్యరాజ్ దర్శకత్వంలో ఆయన కుమారుడు శాంత్నూ భరద్వాజ్ హీరోగా నటించిన సిద్దు +2 సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసింది నటి చాందిని తమిళరసన్. ఈ సినిమాలో తన నటనకు గాను ప్రశంసలు అందుకొని ఆ తర్వాత వరుస అవకాశలు అందుకుంది. కానీ హీరో ఆర్య ప్రొడక్షన్ వెంచర్ పడితురైలో నటించిన తర్వాత ఆమె కాస్త గ్యాప్ తీసుకొని తన డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టి తెలుగు, తమిళ ఆడియన్స్ మనసు దోచుకుంది.
 
కాళిచరణ్ అనే సినిమాతో టాలీవుడ్ గడపతొక్కిన చాందిని.. ఈ సినిమాలో తీర్థ రోల్ చేసి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీకి 'రామ్ అసుర్' సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ మూవీ ఘనవిజయం సాధించడం, ఇందులో చాందిని నటన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ కావడంతో అవకాశాల పరంగా ఆమె ఫుల్ బిజీ అయింది. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.
 
ప్రస్తుతం సునీల్, ధనరాజ్‌లతో కలిసి 'బుజ్జి ఇలా రా' సినిమా చేస్తోంది చాందిని తమిళరసన్.  ఇది కాకుండా మరో పది ప్రాజెక్ట్‌లలో ఆమె భాగమవుతోంది. బాలాజీ శక్తివేల్ సినిమాలో నటిస్తుండటంతో పాటు రాధా మోహన్ దర్శకత్వంలో S.J సూర్య నటించిన ‘బొమ్మై’లో హీరోయిన్‌గా చేస్తోంది. సెల్వ దర్శకత్వం వహించిన అరవింద్ స్వామి ‘వనంగముడి’ నటుడి మరో చిత్రం ‘సాధురంగ వేట్టై 2’లో నటిస్తోంది. అలాగే విజయ్ వసంత్ చేస్తున్న 'మై డియర్ లిసా'లో, సుందర్ సి ప్రధాన పాత్రలో రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్, తెలుగు/తమిళ ద్విభాషా చిత్రం సమేధ, హీరోయిన్ సెంట్రిక్ హారర్ చిత్రం మాయతిరైలో కూడా నటిస్తోంది.
 
ఇవి కాకుండా ప్రస్తుతం మరికొంతమంది దర్శకనిర్మాతలతో కూడా చాందిని చర్చలు జరుపుతోంది. అనేక ప్రాజెక్ట్‌లతో చాలా బిజీగా ఉన్న చాందినిని ఈ సినిమాలు అందలమెక్కిస్తాయని, ఆమె స్పీడ్ చూస్తుంటే త్వరలోనే స్టార్‌ స్టేటస్ పట్టేస్తుందని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ‌మ్మ‌త్తైన చూపుల‌తో అల‌రిస్తోన్న పూర్ణ