Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ్యూహం సెన్సార్ రిజెక్ట్.. జీవిత రాజశేఖర్ పైరవి అందుకే ఆమెను తొలగించాలని డిమాండ్

jeevita rajaseka with jagan
, గురువారం, 2 నవంబరు 2023 (15:59 IST)
jeevita rajaseka with jagan
రాంగోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం చిత్రాన్ని సెన్సార్ రిజెక్ట్ చేసింది. దాంతో రీ సెన్సార్ కు సెన్సార్ ఆర్.సి. మెంబర్ అయిన సీనియర్ యాక్ట్రెస్  జీవిత రాజశేఖర్ , వై.సి.పి.లీడర్ అయినందున జీవిత రాజశేఖర్ గారిని  ఈ సినిమా వరకు మాత్రమే సెన్సార్ చేయకుండా తొలగించాలని సీనియర్ నిర్మాత నట్టికుమార్ సెన్సార్ కు మనవి చేశారు. ఇందుకు సంబంధించిన లెటర్ ను కూడా ఆయన పోస్ట్ చేశారు.
 
ఈ సినిమా జగన్ కు పూర్తి అనుకూలంగా, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను వ్యంగంగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ను ఒక్కసారి చూస్తే ఈ విషయం  చాలా సులువుగా అర్ధమవుతుంది. తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్, 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ గా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్, ఇంకా కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్ మోహన్ సింగ్, సోసియా గాంధీi పాత్రలను  వారి పోలికలు దగ్గరగా ఉన్న నటీనటులనుఎంపిక చేసుకుని మరీ, ఈ సినిమాలో వారి పాత్రలను వ్యంగంగా చూపించారు.
 
 ప్రస్తుతం ఐదు స్టేట్స్ కు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలుగు స్టేట్ అయిన తెలంగాణ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగు దేశం పార్టీ చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత,, బెయిల్ పై విడుదలైన తర్వాత రెండు తెలుగు స్టేట్స్ లో ప్రజలు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్న సంగతి విదితమే.దీంతో ఈ ఎన్నికల సమయంలో ఈ సినిమాను విడుదల చేసినట్లయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ ఎదురవుతుంది..
 
మరోవైపు ఈ సినిమాను విడుదల చేయకుండా నిలుపుదల చేయాలని ఎలక్షన్ కమిషన్ కు కూడా కంప్లైంట్ చేసాం. Censor RC Member అయిన  జీవిత రాజశేఖర్ గారిని  ఈ సినిమాకు సెన్సార్ చేయడానికి వీలులేకుండా Censor RC నుంచి జీవిత రాజశేఖర్ గారిని తప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.  
 
ఈ మూవీని తీసిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కూడా పార్టీ లీడర్, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ కూడా నియమించింది. ఈ సినిమా డైరెక్టర్ వర్మ, జీవిత మంచి ఫ్రెండ్స్. కొంతకాలం క్రితం దెయ్యం అనే సినిమాను వారితో రూపొందించారు కూడా. ఈ విషయాలన్నీ పరిగణలోనికి తీసుకుని,, "VYUHAM" సినిమా సెన్సార్ RC నుంచి జీవిత రాజశేఖర్ గారిని తప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షారుఖ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా డంకీ డ్రాప్ 1 విడుదల