Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షారుఖ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా డంకీ డ్రాప్ 1 విడుదల

Shah Rukh Khan, Taapsee Pannu
, గురువారం, 2 నవంబరు 2023 (15:38 IST)
Shah Rukh Khan, Taapsee Pannu
రాజ్ కుమార్ హిరాణీ తీసిన సినిమాలు, చెప్పిన కథలు దేశ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాయి. మరోసారి సున్నితమైన ప్రేమ, స్నేహం అనే అంశాల చుట్టూ, హాస్యభరితంగా తెరకెక్కించిన ‘డంకీ’ థియేటర్లో వచ్చేందుకు సిద్దంగా ఉంది.
 
షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ కాంబోలో మొదటిసారిగా సినిమా వస్తుండటంలో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. షారుఖ్ ఖాన్ పుట్టిన రోజు (నవంబర్ 2) సందర్భంగా ‘డంకీ’ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. విదేశాలకు వెళ్లాలనే నలుగురు స్నేహితుల కల చుట్టూ ‘డంకీ’ కథ తిరుగుతుంది. ఈ క్రమంలో ఆ నలుగురికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. యథార్థ సంఘటనల ఆధారంగా తీసుకున్న ఈ కథలో ప్రేమ, స్నేహబంధాల గొప్పదనం చాటి చెప్పేలా ఉండబోతోంది. రాజ్ కుమార్ హిరాణీ తన మార్క్‌ను చూపిస్తూ ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించారు.
 
బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చార్, అనిల్ గ్రోవర్ వంటి వారి పాత్రలను పరిచయం చేశారు. అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రిస్మస్‌కు అందరి మనసులు గెలుచుకునేందుకు ‘డంకీ’ రాబోతోంది.
 
జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్ కుమార్ హిరాణీ ప్రజెంటేషన్ బ్యానర్లపై సంయుక్తంగా రాబోతోన్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరాణీ, గౌరీ ఖాన్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాజ్ కుమార్ హిరాణీ, అభిజాత్ జోషి, కనికా థిల్లాన్ రాసిన ఈ కథను రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆనంద్ దేవరకొండ, రితిక నాయక్ డ్యూయెట్ ప్రారంభం