హీరో నితిన్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రంలో కేథరిన్ థ్రెసా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ బ్యానర్పై ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ హైద్రాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది.
మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఇద్దరు హీరోలు కనిపించబోతోన్నారు. ఇందులో కృతి శెట్టి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. తాజాగా కేథరిన్ థ్రెసాను మరో హీరోయిన్గా చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లోనే కేథరిన్ థ్రెసా పాల్గొనబోతోన్నారు. కేథరిన్ థ్రెసా, నితిన్లు కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే.
నితిన్ను ఇది వరకెన్నడూ చూపించని కొత్త అవతారంలో దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి చూపించబోతోన్నారు. ఇంకా ఈ చిత్రంలో ఎంతో మంది ప్రముఖ నటీనటులున్నారు. అద్భుతమైన సాంకేతిక బృందం ఈ సినిమా కోసం పని చేస్తోంది.