Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షిర్డీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. నటి మాధవీలతపై కేసు

Advertiesment
madhavilatha
కోట్లాది మంది ఆరాధ్యదైవంగా ఉన్న షిర్డీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను సినీ నటి మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ హైదరాబాద్ సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాధవీలతతో పాటు మరికొందరు యూట్యూబర్లపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
కాగా, షిర్డీ సాయిబాబా దేవుడు కాదంటూ మాధవీలత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. మాధవీలతతో పాటు ఈ వివాదాన్ని ప్రోత్సహించిన పలువురు యూట్యూబర్స్‌, సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్ల పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. 
 
కాగా, గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్న మాధవీలత.. ఇటీవల షిర్డీ సాయిబాబాను ఉద్దేశించి కొన్ని పోస్టులు పెట్టారు. ఈ వ్యాఖ్యలు సాయిబాబా భక్తుల నమ్మకాలను కించపరిచేలా ఉన్నాయని కొందరు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన సరూర్ నగర్ పోలీసులు మాధవీలతతో పాటు ఆమెకు మద్దతుగా ఇంటర్వ్యూలు చేసి, వీడియోలు ప్రచారం చేసిన వారిపైనా కేసు నమోదు చేశారు. 
 
పైగా, ఈ కేసు విచారణలో భాగంగా, మంగళవారం 10 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ నిందితులందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ఇతరుల నమ్మకాలను కించపరిచినా లేదా అసత్య ప్రచారాలు చేసినా ఐటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వ్యూస్ కోసం వివాదాలను ప్రోత్సహించే యూట్యూబ్ చానెళ్లపై కూడా దృష్టిసారించినట్టు తెలిపారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Allu Arjun: అట్లీతో అల్లు అర్జున్ సినిమా.. కోలీవుడ్‌లో స్టార్ హీరో అవుతాడా?