Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఎల్లో కలర్ గౌ'న్‍లో అందాలను ఆరబోసి.. కామెంట్ ప్లీజ్ అంటున్న లారిస్సా బోనేసి...

Advertiesment
Brazilian model
, గురువారం, 7 ఫిబ్రవరి 2019 (16:06 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త కొత్త హీరోయిన్లు పరిచయమవుతున్నారు. అలాంటివారిలో బ్రెజిల్ మోడల్ లారిస్సా బోనేసి ఒకరు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'తిక్క' చిత్రం ద్వారా వెండితరకు పరిచయమైంది. ఆ తర్వాత సందీప్ కిషన్ నటించిన 'నెక్స్ట్ ఏంటి' అనే చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాలు ఆమెను పూర్తిగా నిరాశపరిచింది. 
 
ఆ తర్వాత ఆమెకు సినీ ఛాన్సులు రాలేదు. దీంతో ఈ అమ్మడు హైదరాబాద్‌ను వీడి ముంబైకు వెళ్లిపోయింది. స్వతహాగా మోడల్ కావడంతో గ్లామర్ ఫోటోలకు ఏమాత్రం కొదవలేదు. సోషల్ మీడియాలో వరుసగా గ్లామర్ షో పోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా ఎల్లో కలర్ గౌన్‌లో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వెబ్‌సైట్‌లో షేర్ చేసింది. వాటి కింద కామెంట్ ప్లీజ్ అంటూ పెట్టింది. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
'చాలా సేపు ఆలోచించా.. మంచి క్యాప్షన్ దొరకలేదు. ఈ ఫొటోకు మంచి క్యాప్షన్ ఇవ్వండి' అని పోస్ట్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మెదడుకు పదునుపెట్టి మంచి క్యాప్షన్ ఇవ్వండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అయోగ్య'... అంతా మక్కీకి మక్కీ దింపేశారు...