Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రహ్మోత్సవం సమంతకు కలిసొస్తుందా? స్కిన్ ఎలర్జీ దెబ్బ కొట్టిందా?

Advertiesment
Brahmotsavam trailer: Heres the sneak-peek into Mahesh Babus upcoming family drama
, సోమవారం, 9 మే 2016 (12:14 IST)
అగ్ర హీరోయిన్ సమంతకు క్రేజ్ తగ్గిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. గత ఏడాది అమ్మడుకు హిట్స్ లేకపోవడంతో పాటు అవకాశాలు సైతం సన్నగిల్లడంతో సమంత బ్యూటీకి పవర్ తగ్గిపోయిందని సినీ జనం అంటున్నారు. తానేమంత అందంగా ఉండనని అప్పుడప్పుడు ఓపెన్‌గా చాలా సందర్భాల్లో అమ్మడు చెప్పేసింది.

ఈ నేపథ్యంలో గత ఏడాది సమంత నెల రోజులకు పైగా బయటకు కూడా రాలేదు. సినిమా షెడ్యూల్‌లో తేడా రావడంతో సమంత పెళ్లి చేసుకోనుందని టాక్ వచ్చింది. కానీ స్కిన్ ఎలర్జీ కారణంగా శామ్స్ బయటకు రాలేదని.. దాని నుంచి మెల్లగా కోలుకుని సినిమాల్లో యాక్టింగ్ స్టార్ట్ చేసింది సమంత.
 
కానీ ఆ స్కిన్ ఎలర్జీ ఎఫెక్ట్ సమంత గ్లామర్‌పై స్పష్టంగానే కనిపిస్తోంది. తాజాగా విడుదలైన 24లో సమంతలో అందం పాళ్లు బాగా తగ్గింది. యాక్టింగ్ ట్యాలెంట్‌లో ఏ మాత్రం మార్పు లేకపోయినా.. చూడ్డానికి మాత్రం మునుపటి సమంత కనిపించలేదు. తాజాగా బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్ కానుంది.

ఇందులో సమంత అందానికి ఢోకా ఉండదని సినీ జనం అంటున్నా.. కాజల్ అగర్వాల్‌నే బాగా హైలైట్ చేసినట్లు టాక్ వస్తోంది. దీంతో సమంత రోల్‌కు అంత ప్రాధాన్యం ఉండదని.. సో.. సో.. గా ఉంటుందని.. దీంతో ఈ ఏడాది కూడా సమంతకు గుర్తింపునిచ్చే రోల్స్‌తో పాటు గ్లామర్ రోల్స్ తక్కువేనని సినీ పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్య '24' చిత్రో ఓపెనింగ్స్ అదుర్స్.. ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.25 కోట్లు