Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సూర్య '24' చిత్రం ఓపెనింగ్స్ అదుర్స్.. ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.25 కోట్లు

Advertiesment
'24' US box office collection: Suriya-starrer off to a good start
, సోమవారం, 9 మే 2016 (12:13 IST)
విక్రమ్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించి తాజాగా విడుదలైన చిత్రం ''24''. ఈ చిత్రంలో సూర్య సరసన సమ౦త, నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించారు. తాజాగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే దేశ వ్యాప్తంగా మొత్తం రూ.25 కోట్లను వసూలు చేసింది. సూర్య కెరీర్‌లో ఇంత మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
వారాంతం పూర్తయ్యేసరికి ఈ వసూళ్లు రూ.100 కోట్ల మార్కుకు చేరువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం కథ మొత్తం గడియారం అనే అంశంతో రూపొందించబడింది. ఈ చిత్రంలో సూర్య మూడు డిఫరెంట్ రోల్స్‌లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ చిత్రాన్నిరూ.75 కోట్ల భారీ బడ్జెట్‌తో సూర్య సొంతగా నిర్మించారు. 
 
ఈ వారంలో తెలుగు, తమిళంలో పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాకపోవడంతో వచ్చేవారం వరకు కలెక్షన్ల పరంగా ఎటువంటి పోటీ ఉండదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ సినిమాకు అన్నివర్గాల నుండి పాసిటివ్ టాక్ లభించింది. చాలాకాలం నుంచి మంచి విజయాలు లేక సతమతమవుతున్న సూర్యకు ''24'' ఆ లోటును ఒక విధంగా తీర్చిందనే చెప్పాలి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజినీకాంత్ 'రోబో 2.0' గ్రాఫిక్స్ కోసం రూ.100 కోట్ల బడ్జెట్