Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రహ్మానందం జాతిరత్నం.. మళ్లీ రేసుగుర్రంలా మారారా? (Video)

Advertiesment
బ్రహ్మానందం జాతిరత్నం.. మళ్లీ రేసుగుర్రంలా మారారా? (Video)
, శుక్రవారం, 12 మార్చి 2021 (09:46 IST)
బ్రహ్మానందం మళ్లీ ఫామ్‌లోకి వచ్చారనే చెప్పాలి. 'జాతిరత్నాలు' చిత్రంలో బ్రహ్మీ నిడివి చాలా అంటే చాలా తక్కువ. అయినా సరే.. అస్సలు కుర్రాళ్లకి ఏ మాత్రం తీసిపోని విధంగా సెటైర్లు పేల్చారు. థియేటర్లో నవ్వుల మోత మోగించారు. ఇప్పటికే 'అల వైకుంఠపురములో..' తళుక్కున మెరిసిన బ్రహ్మి.. 'జాతిరత్నాలు' చిత్రంలో కూడా ఓ రత్నంలా కనిపించారు. 
 
బ్రహ్మానందాన్ని ఈ చిత్రంలో చూసిన వారంతా చాలా ఫ్రెష్‌గా ఫీలవుతున్నారు. 'జాతిరత్నాలు అంటే.. పెద్ద పెద్ద పేర్లు, మహాత్మాగాంధీ, కలామ్‌, లాల్‌ బహదూర్‌ శాస్త్రి పేర్లు చెప్పుకునే చిత్రం కాదిది. అబ్బో.. వాడితో మనం మాట్లాడలేం రా బాబు.. వాడొక జాతిరత్నం.. అని అనుకుంటుంటాం కదా.. అలాంటి కోవకి చెందిన సినిమా ఇది..' ఇవి తన గురించి, ఈ సినిమా గురించి బ్రహ్మీ చెప్పిన తీరు ఉంది చూశారా.. వెంటనే థియేటర్‌కి పరిగెత్తించేస్తుంది. 
 
నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి టైటిల్ రోల్స్ పోషించిన ఈ 'జాతిరత్నాలు' చిత్రానికి అనుదీప్ కె.వి. దర్శకుడు. స్వప్నా సినిమా బ్యానర్‌పై 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. మహాశివరాత్రి కానుకగా గురువారం విడుదలైన ఈ చిత్రం.. విడుదలైన అన్నిచోట్లా పాజిటివ్‌ టాక్‌తో సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ 'ఆదిపురుష్‌' సీతగా ఆ హీరోయిన్ ఫిక్స్...