ఇప్పుడు టాప్ బాలీవుడ్ రచయిత, కానీ ఒకప్పుడు వ్యభిచారి

మంగళవారం, 12 మే 2020 (22:46 IST)
షాగుప్తా. ఈమె పెద్దగా పరిచయం లేకపోయినా బాలీవుడ్లో మాత్రం మర్డర్ 2, రాజ్, జిస్మ్ 2, ఆషిక్ 2 లాంటి రొమాంటిక్ చిత్రాలను చూసిన వారు ఈమె గురించి ఠక్కున చెప్పేస్తారు. తెలుగులోను నీ జతగా నేనుండాలి అనే చిత్రానికి కథ ఈమే రాశారు.
 
అయితే ఈమె ఒకప్పుడు బార్ డ్యాన్సర్.. వ్యభిచారిణి. ఈ విషయాన్ని ఈమే స్వయంగా చెబుతుంటుంది. బాలీవుడ్లో బడా నిర్మాత మహష్ భట్ ఆమెకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు షాగుప్తా. మంచి కథలతో తనలోని రచయితను బయట పెట్టారు.
 
విషాదకరమైన సంఘటన ఏంటంటే ఆమె తల్లిదండ్రులు ఎవరో ఆమెకు అస్సలు తెలియదు. షాగుప్తాని ఒక మహిళ దత్తత తీసుకుంది. ఆమె అనారోగ్యంతో చనిపోవడంతో ఆమెను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అలా ఆమె బార్ డ్యాన్సర్‌గా మారిపోయి చివరకు వ్యభిచారిణిగా మారిందట. కానీ ఆమెలోని రచయిత అప్పుడప్పుడు బయటకు రావడంతో ఒక్క అవకాశం వచ్చింది. ఆ ఒక్క అవకాశంతోనే ఆమె తానేంటో నిరూపించుకుని బాలీవుడ్లో ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం విజయ్‌తో లారెన్స్ మూవీ చేస్తున్నాడా?