Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Advertiesment
Dhruv Vikram

చిత్రాసేన్

, మంగళవారం, 14 అక్టోబరు 2025 (19:37 IST)
Dhruv Vikram
నీలం స్టూడియోస్, అప్లాజ్  ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ దర్శకుడుగా ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న చిత్రం బైసన్. అక్టోబర్ 24న జగదంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను హీరో దగ్గుబాటి రానా రిలీజ్ చేసి టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు.
 
 1990 బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట  కథాంశంతో వచ్చిన ఈ ట్రైలర్  రా అండ్ రస్టిక్‌గా ఇంట్రెస్టింగ్‌గా సాగింది.  తమ గ్రామంలో ముందు కబడ్డీ పిచ్చి పుట్టాకే మనిషి పుడతాడు అని కాన్సెప్ట్ ను తెలియజేసేలా ఉంది ట్రైలర్.  ఓ వైపు ఆట కోసం తను కన్న కల, మరోవైపు తీరని పగతో పాటు తండ్రీ కొడుకుల రిలేషన్ తో  సాగిన ట్రైలర్ ఆకట్టుకుంది. 
 
అలాగే రాజకీయ పరమైన అంశాలు,  కుటుంబాల ఎమోషన్ వంటి అన్ని రకాల ఎలిమెంట్స్‌తో కంప్లీట్ యాక్షన్ డ్రామా గా ట్రైలర్ ను కట్ చేశారు .  ఫస్ట్ షాట్ లో ఆంబోతు  పుర్రెను చూపించడం, చివరిలో అదే పుర్రెను హీరో తండ్రి నీళ్లలో పడేయడం వంటి సీన్స్ సినిమాపై క్యూరియాసిటీని  క్రియేట్ చేశాయి.  ఒకప్పుడు తన కొడుకు కలలకు వ్యతిరేకంగా ఉన్న తండ్రి తర్వాత అతడిని విజయ శిఖరాలకు తీసుకెళ్లేలా ప్రోత్సహించే సీన్ హృదయానికి హత్తుకునేలా ఉంది.

రియలిస్టిక్ విజువల్స్, అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో పాటు హృదయన్ని హత్తుకునేలా ఉన్న ఎమోషన్ సీన్స్ తో సాగిన ఈ ట్రైలర్ ధృవ్ కెరీర్లో మరో మైలు రాయిగా నిలుస్తుంది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో లవ్ ట్రాక్ ఆకట్టుకుంది.  మరో హీరోయిన్ గా రెజిషా విజయన్ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించింది.  పశుపతి, కలైయరసన్,  హరికృష్ణన్‌, అళగమ్‌ పెరుమాళ్‌, అరువి మదన్‌  ప్రధాన పాత్రలు పోషించారు. సమీర్ నాయర్,  దీపక్ సెగల్,  పా రంజిత్, అదితి ఆనంద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నివాస్ కే ప్రసన్న సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ