బాలీవుడ్ నటి బిపాసా బసు వివాహం అట్టహాసంగా జరిగింది. నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌తో శనివారం ముంబైలో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. బిపాసా రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఈ సందర్భంగా బిపాసా బసు వివాహ వేడుకకు బంధుమిత్రులు ప్రముఖులు హాజరయ్యారు. ఇంకా బాలీవుడ్ స్నేహితులు, ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
శనివారం రాత్రి జరిగిన వీరి వివాగ రిసెప్షన్‌కు బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, టబు, సోనమ్ కపూర్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, ప్రీతి జింటా, సుస్మితా సేన్, సంజయ్‌దత్ దంపతులు, రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా తదితరులు హాజరయ్యారు.
అంతకుముందు శుక్రవారం బిపాసా, కరణ్‌ల మెహందీ, సంగీత్ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బిపాసా బసు, కరణ్‌ల స్నేహితులు శిల్పాశెట్టి, షమీతా శెట్టి, సోఫీ చౌదరి, ఫ్యాషన్ డిజైనర్ రాఖీ, ఫిట్‌నెస్ ఎక్స్‌ఫర్ట్ పాండే తదితరులు హాజరయ్యారు.