Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కబాలి టీజర్ రిలీజ్ : రజనీ కాంత్ లుక్ అదిరింది.. లేటు వయసులోనూ తగ్గని స్టైల్!(VIDEO)

కబాలి టీజర్ రిలీజ్ : రజనీ కాంత్ లుక్ అదిరింది.. లేటు వయసులోనూ తగ్గని స్టైల్!(VIDEO)
, ఆదివారం, 1 మే 2016 (12:11 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కబాలి సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పా రంజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ట్రైలర్‌ను పా రంజిత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేగాకుండా కబాలి ట్రైలర్‌ వీడియోను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈ ట్రైలర్‌ను వయసు మీద పడిన డాన్ అవతారంలో రజనీకాంత్ కనిపించారు. 
 
అయినప్పటికీ లుక్‌లో ఎలాంటి స్టైల్ తగ్గకుండా రంజిత్ తెరకెక్కించారు. ఈ ట్రైలర్‌కు ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వస్తోంది. ఇకపోతే.. కబాలిలో రజనీకాంత్‌కు జంటగా రాధికా ఆప్టే నటించగా, కలైపులి ఎస్‌. థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా సినిమాలో నాజర్, రోషన్, దినేష్ రవి, ధన్సిక, కలైయరసన్, జాన్ విజయ్, కిషోర్ తదితరులు నటిస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది త్రివిక్రమ్‌నే అడగాలి... నటుడు సూర్య ఇంటర్య్యూ