Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ ఆరో సీజన్.. గీతూ ఓవరాక్షన్.. మాటలు కోటలు దాటుతాయ్.. కానీ?

Advertiesment
Geethu
, గురువారం, 27 అక్టోబరు 2022 (11:48 IST)
Geethu
బిగ్ బాస్ ఆరో సీజన్ టీఆర్పీ రేటింగ్ దారుణంగా పడిపోయింది. బిగ్ బాస్ ఇంట్లో గాలాట గీతూని చూడాలంటే చాలా చిరాగ్గా ఉందని ప్రేక్షకులు అంటున్నారు.  మొదటి వారంలోనే ఇంట్లో నుంచి బయటకు వెళ్తుందని అంత అనుకుంటుంటే.. గీతూ ఇంకా హౌస్‌లో కొనసాగుతోంది. 
 
అసలు గీతూ మాటలు వింటుంటే టీవీలో సౌండ్ మ్యూట్ చేయాలి అని అనిపిస్తుందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ వస్తున్నాయి. హౌస్‌లో ఆట అంటేనే గీతూ ఆమడ దూరంలో నిలుస్తోంది. 
 
గీతూ తను ఆట ఆడటం కన్నా కూడా పక్కవారిని ఎలా ఆట ఆడకుండా చేయాలి అనేది ఎక్కువగా ఆలోచిస్తుంది. రూల్స్ పెడుతోంది.. కానీ ఆ రూల్స్‌ను ఆమె పాటించదు. అంతెందుకు బిగ్ బాస్ పెట్టిన రూల్స్‌ని కూడా పాటించేది  కాదు. మాటలు మాత్రమే కోటలు దాటుతాయి. కానీ చేతల్లో మాత్రం కనిపించవు.
 
ఇంకేమైనా అంటే తానే ఆటలు బాగా ఆడతానని ఓ గొప్ప ప్లేయర్ అని బ్రమలో బతికేస్తుంది గీతూ నా ఆట ఇంకా ఎవరూ సరిగ్గా చూడలేదని ఇది స్టార్టింగ్ మాత్రమేనని ఎండింగ్ ఇంకా ఉందని.. అది చూస్తే మీరందరూ నన్నే బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తారు అంటూ కోతల రాయుడు గీతూ మాటలతో రెచ్చగొడుతుంది.
 
చేపల చెరువు టాస్క్‌లో కూడా అంతే. కీర్తి, మెరీనా, రేవంత్ వాళ్ళని రెచ్చగొడదామని ట్రై చేసింది.. వాళ్ళు పట్టుకున్న చేపలు లాక్కోవాలని ట్రై చేసింది. కానీ వర్కౌట్ అవలేదు.. దాంతో తక్కువ చేపలు తన దగ్గరే ఉండటంతో గీతూ ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. 
 
పిచ్చి చేష్టలు, తింగరి ఆలోచన చేసే గీతూ తన పరువును తానే తీసుకుంటుంది. గీతూ తన అతి తెలివి , మూర్ఖత్వమే జీవితం డిన్నర్ కాకుండా చేస్తున్నాయి బిగ్ బాస్ హిస్టరీలో వరస్ట్ అండ్ ఇరిటేటింగ్ కంటెస్టెంట్‌గా గీతూ పేరు తెచ్చుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆమె శ‌వ పేటిక చుట్టూ మూడు సార్లు తిరిగిన జ‌య‌ల‌లిత‌