ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జనవరి 10న వైకుంఠ ఏకాదశి కావడంతో తమ ఇంటికి సమీపంలో ఉండే ఆలయాలకు భగవంతుని దర్శన కోసం జనాలు బారులు తీరారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ తిరుమల తిరుపతికి వెళ్లారు.
ఆమె శ్రీవారి దర్శనం కోసం మోకాళ్ళపై తిరుపతి కొండ మెట్లు ఎక్కి, తన భక్తిని చాటుకున్నారు. ఆమె ఎవరో కాదు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నందిని రాయ్. శ్రీవారి దర్శనం కోసం మోకాళ్లపై తిరుపతి కొండ మెట్లు ఎక్కింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈమె నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గర అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోని తాజాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్ల పైకి మోకాళ్ళతో మెట్లు ఎక్కుతూ.. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.
నందిని రాయ్ విషయానికి వస్తే.. నటిగా, మోడల్‌గా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. 2010లో మిస్ ఆంధ్ర ప్రదేశ్‌గా టైటిల్ గెలుచుకుంది. 80కి పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకి దాదాపు మోడల్‌గా పనిచేసింది. అంతేకాదు 2010లో మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2009లో మిస్ ప్యాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వంటి టైటిల్స్ కూడా గెలుచుకుంది.