Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో తొక్కిసలాట : నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్ ఇదే..

chandrababu naidu

ఠాగూర్

, గురువారం, 9 జనవరి 2025 (09:54 IST)
శ్రీవైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం శ్రీవారి భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకోగా, ఐదుగురు మహిళలతో పాటు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ పర్యటన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ తొక్కిసలాటలో గాయపడి రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించనున్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆయన పరిహారం ప్రకటిస్తారు.
 
కాగా, సీఎం చంద్రబాబు తిరుపతి షెడ్యూల్ ఇలా సాగనుంది. 
గురువారం ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టరులో బయలుదేరుతారు.
గం.11.10 నిమిషాలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు.
గం.11.15 నిమిషాలకు విజయవాడ విమానాశ్రయం నుంచి విమానంలో తిరుపతికి బయలుదేరుతారు.
గం.12.00కు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.
గం.12 నుంచి గం.3 వరకు రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శిస్తారు. ఈవో, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
ఆ తర్వాత తిరుపతి విమానాశ్రయానికి బయలుదేరుతారు.
మధ్యాహ్నం గం.3.00కు తిరుపతి విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరుతారు.
గం.3.45 నిమిషాలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు.
గం.3.50కి విజయవాడ విమానాశ్రయం నుంచి హెలికాప్టరులో ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరి, సాయంత్రం గం.4.00కు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
 
తిరుపతిలో తోపులాట - ఆరుగురు మృతి : సెక్యూరిటీ లోపం వల్లే... 
 
తిరుమలలో ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పిస్తున్నారు. ఈ దర్శనాల కోసం తిరుపతి, తిరుమలలో రేపటి నుంచి టోకెన్ల జారీకి తితిదే ఏర్పాట్లు చేసింది. అయితే, భక్తులు ముందుగానే టోకెన్ జారీ కేంద్రాల వద్దకు భారీగా తరలివచ్చారు. 
 
ఈ క్రమంలో తిరుపతిలో శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం వద్ద ఉన్న టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తుల మధ్య భారీగా తోపులాట చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు సొమ్ముసిల్లి పడిపోవడంతో వారిని తిరుపతిలోనే రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్టు గుర్తించారు. 
 
ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఘటన స్థలాలకు చేరుకుని పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. వైకుంఠ ద ్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్దకు అదనపు పోలీస్ బలగాలను తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో తోపులాట - ఆరుగురు మృతి : సెక్యూరిటీ లోపం వల్లే...