బిగ్ బాస్ తెలుగు సీజన్ 5.. విజయవంతంగా సాగుతుంది. ఇప్పటికే ఏడువారాలు పూర్తి చేసుకోని .. ఇప్పుడు 8 వారం ఆఖరికి చేరింది. ఈ క్రమంలో ఏడుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయారు. నేడు మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడానికి సిద్దంగా ఉన్నారు.
అయితే తాజాగా విడుదలైన ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. దీపావళి స్పెషల్ గా మెగా ఎపిసోడ్ ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీం. ఇక సాధారణంగా ఆదివారం నాడు 9 నుంచి స్టార్ట్ అయ్యే ఎపిసోడ్, ఈ రోజు చాలా స్పెషల్ గా సాయంత్రం ఆరు గంటల నుంచే షో ను ప్రారంభం కానున్నది. ఈ ఎపిసోడ్ సంబంధించిన ప్రోమో నెట్టింట్లో సందడి చేస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
బిగ్ బాస్ హౌస్ లో దీపావళి సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. భారీగానే ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీం. ఈ స్పెషల్ ఎపిసోడ్ ను మరింత స్పెషల్ చేయలని సెలబ్రేటీలను హౌస్లోని పిలిచి సందడి చేయించారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఎవరెవరు హౌస్ లోపలికి వచ్చారు అనే విషయాన్ని తాజాగా విడుదలైన ప్రోమో లో చూపించారు.
ప్రోమో ప్రకారం ముందుగా టాలీవుడ్ హాట్ బ్యూటీ, హీరోయిన్ శ్రియ హౌస్ లోపలికి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి.. కంటెస్టెంట్లను సర్ ప్రైజ్ చేసింది. తన హాట్ స్టెప్పులతో హౌస్ హీటెక్కించింది. శ్రియ రావడం రావడమే నాగార్జునకు హగ్ ఇచ్చింది. ఆ తరువాత కంటెస్టెంట్స్ లను తనదైన శైలిలో పలికరించింది.
ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. మిమ్మల్ని చూసే నేను సిగ్గు పడడం నేర్చుకున్నా.. అని కామెంట్ చేసింది. ఇక శ్రియ తర్వాత హీరోయిన్ అవికా గోర్ కూడా ఓ మాస్ సాంగ్ కు స్టెప్పులేస్తూ… హౌస్ లోపలికి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె కూడా కంటెస్టెంట్లతో మూచ్చటించింది. ఇతర డ్యాన్సర్ల పెర్ఫార్మెన్స్ లతో షో ఆద్యంతం ఆసక్తికరంగా మారింది.
ఆ తరువాత.. దేవరకొండ బ్రదర్స్.. విజయ్, ఆనంద్ లు ఇద్దరూ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చారు.
కంటెస్టెంట్లతో మాట్లాడుతూ సందడిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆనంద దేవరకొండకు సిరి ఐ లవ్ యు ఆనంద్ అని చెప్పడంతో నాగార్జున కోపం తెచ్చుకుని మొన్న నాకు చెప్పావు ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు? ఇది కరెక్ట్ ఏనా అని అడిగితే, అది మొన్న ఇది ఇప్పుడు అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది సిరి. ఆనంద్ దేవర కొండ హీరోగా నటిస్తున్న పుష్పక విమానం సినిమా నవంబర్ 12వ తేదీన విడుదల అవుతున్న మూవీ ప్రమోట్ చేస్తున్నాడు ఆయన అన్నయ్య విజయ్ దేవరకొండ.
మరోపక్క బిగ్ బాస్ హౌస్ మాజీ కంటెస్టెంట్, సింగర్ కల్పన కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీ చాలా ఆసక్తికరంగా మారింది. షన్నుపై ఓ స్పెషల్ సాంగ్ పాడింది. తన దైనా రేంజ్ లో ఆకట్టుకుంది. తనదైన శైలిలో కంటెస్టెట్ల మీద పంచులు వేసింది. దీంతో షన్ను సిగ్గు పడుతున్నట్టుగా చూపించారు. అనంతరం బుల్లితెర స్టార్ యాంకర్ సుమ.. తనదైన మాటల తూటాలు పేల్చి.. నవ్వులు పూవ్వులు కురిపించింది.
మీరు కూడా యాంకరింగ్ వైపు వస్తే.. నా లాంటి వాళ్లు ఏమై పోవాలి అని ప్రశ్నించింది. నువ్వేమైన తగ్గువనా.. 3 ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టుకొని కూడా ఇక్కడికి వచ్చావు అంటే నీది ఎంత బిజీ షెడ్యూల్ లో అర్థమవుతుంది అనడంతో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా అని అనడంతో అవును నాకు కూడా ఇస్తున్నారు కదా అంటూ చాలా సరదాగా సాగింది వీరిద్దరి సంభాషణ ఆసక్తికరంగా మారింది.
మరో వైపు.. మాజీ కంటెస్టెంట్లు దివి, మోనాల్ గజ్జర్ తో అందమైన అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ముక్కు అవినాష్, బాబా మాస్టర్ లు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేసినట్టు కనిపిస్తుంది. కంటెస్టెంట్లకు ఫన్నీ టాస్కులు ఇచ్చి .. నవ్వుల పువ్వులు పూయించారు. వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారో ఇమిటేట్ చేసి చూపించారు. మొత్తానికి ఇవాళ రాత్రి ఈ స్పెషల్ ఎపిసోడ్ ని బిగ్ బాస్ నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేసారని తెలుస్తుంది.