అత్యాచార కేసులో ఇరుక్కున్న నటి షెహనాజ్ గిల్ తండ్రి!

గురువారం, 21 మే 2020 (21:01 IST)
ఇటీవలి కాలంలో సెలెబ్రిటీలు కూడా వివిధ నేరాలకు పాల్పడుతూ కేసుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ప్రముఖ మోడల్ షెహనాజ్ గిల్ తండ్రి సంతోఖ్ సింగ్ ఓ అత్యాచార కేసులో ఇరుక్కున్నాడు. ఈయనపై ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో రేప్ కేసు నమోదైంది. 20 యేళ్ల అమ్మాయి ఒకరు.... సంతోఖ్ సింగ్ తనను కత్తితో బెదిరించి అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఘటన మే 14వ తేదీన జరిగింది. అయితే, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆ యువతి ఫిర్యాదు చేసేందుకు సాహసం చేయలేక పోయింది. ఈ విషయం తెలుసుకున్న ఓ వ్యక్తి.. ఆ యువతికి ధైర్యం చెప్పడంతో ఇపుడు ముందుకు వచ్చి కేసు పెట్టింది. దీంతో రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటన బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
 
కాగా, 20 యేళ్ల బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు... మే 14వ తేదీన స్నేహితురాలితో కలసి మరో స్నేహితుడు సిద్ధూను కలవడానికి బాధితురాలు బియాస్ గ్రామానికి వెళ్లింది. సాయంత్రం 5.30 గంటలకు వారు బియాస్‌కు చేరుకున్నారు. 
 
ఆ సమయంలో అక్కడకు వచ్చిన సంతోఖ్ సింగ్ తుపాకీ గురిపెట్టి ఆమెను కారులోకి తోశాడు. చంపుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు  చేశారు. సాక్ష్యాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనపై బాలీవుడ్ నటి, సింగర్, బిగ్ బాస్ 13 కంటెస్టెంట్, మోడల్ షెహనాజ్ గిల్ మాత్రం నోరు మెదపడం లేదు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ''ఏ మాయ చేసావే'' జెస్సీకి కాల్ చేసిన కార్తీక్.. లాక్ డౌన్‌తో కేరళకు వచ్చేసిందట...!? (షార్ట్ ఫిలిమ్)