Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిందీ బిగ్ బాస్ ఇంట్లో 28 ఏళ్ల ప్రేయసితో 65ఏళ్ల అనూప్‌... సింగిల్ కాట్ కావాలన్నాడు...

దేశవ్యాప్తంగా అనేక భాషల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న బిగ్‌బాస్ షో, ఇప్పడు హిందీలో 12వ సీజన్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసారి హిందీ బిగ్‌బాస్‌లో "విచిత్ర జోడీస్" అనే కాన్సెప్ట్‌తో స

Advertiesment
హిందీ బిగ్ బాస్ ఇంట్లో 28 ఏళ్ల ప్రేయసితో 65ఏళ్ల అనూప్‌... సింగిల్ కాట్ కావాలన్నాడు...
, గురువారం, 20 సెప్టెంబరు 2018 (12:18 IST)
దేశవ్యాప్తంగా అనేక భాషల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న బిగ్‌బాస్ షో, ఇప్పడు హిందీలో 12వ సీజన్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసారి హిందీ బిగ్‌బాస్‌లో "విచిత్ర జోడీస్" అనే కాన్సెప్ట్‌తో సెప్టెంబర్ 16న ముందుకు రావడం జరిగింది. ఈ కాన్సెప్ట్‌లో భాగంగా ఇప్పటికే పరిచయం ఉండి, ప్రత్యేకమైన బంధాలతో ఉన్న కొన్ని జంటలను హౌస్‌లోకి పంపడం జరిగింది.
 
ఇందులో ఒక జంటగా ప్రఖ్యాత గాయకుడైన 65 ఏళ్ల అనూప్ జలోతా, ఆయనకు జోడీగా గాయని మరియు నటి అయిన 28 ఏళ్ల జస్లీన్ మతారు హౌస్‌లోకి వచ్చారు. అయితే అందరూ వారిది గురుశిష్యుల బంధంగా భావించారు. కానీ హౌస్‌లోకి వెళ్లే ముందు జస్లీన్ మతారుని వారి బంధం గురించి ప్రేక్షకులకు చెప్పమని కోరగా, ఆమె చెప్పిన మాటలు విని ప్రేక్షకులకు కళ్లు బయర్లు కమ్మాయి.
 
తమది గురుశిష్యుల బంధం కాదని, ఆమె అనూప్ జలోతాను ప్రేమిస్తున్నట్లు చెప్పింది. అంతేకాకుండా తాను గత మూడున్నరేళ్లుగా అనూప్ జలోతాతో డేటింగ్ చేస్తున్నానని కూడా చెప్పింది. అయితే తామిద్దరం ఎవరి పనుల్లో వాళ్లు ఎప్పుడూ బిజీగా ఉండటం వల్ల బయట ఎక్కడా కలిసి కాస్త సమయం గడిపే అవకాశం రాలేదని, అయితే ఇప్పుడు బిగ్‌బాస్ పుణ్యమా అని ఆ అవకాశం వచ్చిందని, ఇక్కడ ఉన్నన్ని రోజులూ ఒకరినొకరం ఇంకా బాగా తెలుసుకోవడానికే ప్రయత్నిస్తామని చెప్పింది.
 
అయితే ఆ షో ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన ఆమె తండ్రిని వారి బంధం గురించి అడగగా, తనకు ఈ సంబంధం గురించి ఇంతవరకు తెలియదని చెప్పారు. సంగీతం నేర్పించడానికి ఆయనే తన కూతురిని జలోతాకు పరిచయం చేసానని, ఆయన ఇలాగ చేస్తాడని అస్సలు ఊహించలేదని తెలియజేసారు. వారి మధ్య వయస్సు వ్యత్యాసం 37 సంవత్సరాలని, ఇది ఎలా సాధ్యపడుతుందని ఆయన ఆవేశం వ్యక్తం చేసారు. అయితే తాను వారి బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని కూడా స్పష్టం చేసారు. ఐతే బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన ఈ వృద్ధుడు తమకు డబుల్ కాట్ వద్దు.. సింగిల్ కాట్ చాలని చెప్పడం మరీ విడ్డూరం అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హౌస్‌మేట్స్ అంతా కుక్కలు.. నోరు పారేసుకున్న కౌశల్, బయట కౌశల్ ఆర్మీ