Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తేజస్వి అమ్మాయి అయినందువల్ల అలా అనుకుంటున్నారు... సామ్రాట్...

అందరూ అనుకుంటున్నట్లు తనకు, తేజుకు మధ్య ఏమీ లేదని, తనీష్‌తో ఎలా ఉన్నానో తేజుతో కూడా అలాగే ఉన్నానని చెప్పాడు. తనీష్‌ను హగ్ చేసుకున్నట్లే, కిస్ చేసినట్లే తేజుని కూడా చేసేవాడినని, కానీ తను అమ్మాయి అయినందు వలన అందరూ అలా అర్థం చేసుకున్నారన్నాడు సామ్రాట్.

తేజస్వి అమ్మాయి అయినందువల్ల అలా అనుకుంటున్నారు... సామ్రాట్...
, గురువారం, 4 అక్టోబరు 2018 (17:41 IST)
బిగ్ బాస్ సీజన్ 2 ముగిసింది. ఒక్కో వారం ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ చివరి వారం ఇంట్లో అయిదుగురు. వీళ్లను ఫైనలిస్ట్‌లుగా ఖరారు చేసారు. ఇక గ్రాండ్ ఫినాలె రోజున అందరినీ ఎలిమినేట్ చేసి చివరిగా ఒకరిని విజేతగా ప్రకటించారు. ఈ అయిదుగురు సీజన్ మొత్తం ఇంట్లో ఉన్న సభ్యులు. ఎలిమినేటై బయటకు రాగానే బిజీబిజీగా ఇంటర్వ్యూలతో గడుపుతున్నారు. ఇక ఈ సీజన్‌లో మొదటి ఫైనలిస్ట్‌గా ఎంపికైన సామ్రాట్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
 
అసలు బిగ్ బాస్‌కు పిలుపు వచ్చే సమయానికి తను కుటుంబ సమస్యలు, నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నందున రాకూడదనుకున్నానని, తన తండ్రే ధైర్యం చెప్పి పంపారని సామ్రాట్ తెలిపారు. ఇక ఇంట్లోకి అడుగుపెట్టగానే శ్యామల గారు బిగ్ బాస్‌లోకి సామ్రాట్‌ని ఎందుకు తీసుకున్నారు, అతను అలా ఇలా అని మొదట్లో అనుకున్నారని చెప్పాడు. కౌశల్ అంటే తనకేమీ కోపం లేదని, అతను చాలా క్రమశిక్షణగా ఉంటాడు. అది నాకు నచ్చుతుంది, కానీ అతను కుక్కలు అనేసరికి చాలా బాధ కలిగి అరిచానన్నారు. 
 
ఇక నాని గురించి చెబుతూ చాలా సరదాగా ఉంటారని, ఒక్కోసారి అందరికీ బాగా క్లాస్ పీకుతారని, ఎక్కువగా బలైన సభ్యుడు తనీష్ అని, నాని ఎపిసోడ్‌లో హాయ్ చెప్పే విధానాన్ని బట్టే క్లాస్ ఉంటుందో లేదో తెలిసిపోయేదని తన అనుభవాలను పంచుకున్నారు. తను ఫైనల్‌కి రావడమే టైటిల్ కొట్టినంత ఆనందంగా ఉందని, కౌశల్ గెలిచినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ తనకు సంబంధించినంత వరకు విజేత గీతానే అని తెలిపారు.
 
ఇకపోతే బయట అందరూ అనుకుంటున్నట్లు తనకు, తేజుకు మధ్య ఏమీ లేదని, తనీష్‌తో ఎలా ఉన్నానో తేజుతో కూడా అలాగే ఉన్నానని చెప్పాడు. తనీష్‌ను హగ్ చేసుకున్నట్లే, కిస్ చేసినట్లే తేజుని కూడా చేసేవాడినని, కానీ తను అమ్మాయి అయినందు వలన అందరూ అలా అర్థం చేసుకున్నారని సామ్రాట్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణాదికి రావాలంటే జక్కన్న కథ కావాలంటున్న శ్రీదేవి కూతురు