Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరంజీవి "భోళాశంకర్‌"కు వీడిన చిక్కులు - యధావిధిగానే రిలీజ్

bhola shankar
, గురువారం, 10 ఆగస్టు 2023 (21:52 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన "భోళాశంకర్" చిత్రానికి కోర్టు చిక్కులు వీడాయి. దీంతో ఆగస్టు 11వ తేదీన యధావిధిగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. గాయత్రి ఫిలిమ్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. దీంతో "భోళాశంకర్" విడుదలపై ఉన్న సందిగ్ధత వీడిపోయింది. 
 
"భోళాశంకర్" చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టుకు ఆశ్రయించారు. ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర తనను రూ.30 కోట్ల మేర మోసం చేసినట్టు ఆరోపించారు. "ఏజెంట్" సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలలో ఐదేళ్లపాటు తమ గాయత్రీ ఫిలిమ్స్‌కు ఇస్తానని గతంలో చెప్పారని, ఈ మేరకు అగ్రిమెంట్ రాసిచ్చారని ఇందుకు తాను తన నుంచి రూ.30 కోట్లు తీసుకున్నట్టు పేర్కొన్నారు. 
 
కానీ, తనకు వైజాగా జిల్లా మాత్రమే హక్కులు ఇచ్చారని, తదనంతర పరిణామాల నేపథ్యంలో తదుపరి సినిమా విడుదలకు ముందే తన డబ్బులు చెల్లిస్తానని మాటిచ్చి, మాట తప్పారని, అందువల్ల చిత్ర విడుదలను నిలిపుదల చేయాలని కోరారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు.. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆగస్టు 11వ తేదీన ఈ చిత్రం యధావిధిగా విడుదల చేయనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాండీవధారి అర్జున లో యాక్ష‌న్ మాత్ర‌మే కాదు అంత‌కు మించి అంశాలు ఉన్నాయి : వ‌రుణ్ తేజ్‌