Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘భీష్మ’ ‘సింగిల్స్ యాంథమ్’ వ‌చ్చేసింది..

Advertiesment
Bheeshma Single's Anthem Song
, శనివారం, 28 డిశెంబరు 2019 (21:30 IST)
నితిన్, రష్మిక మందన్న, వెంకీ కుడుముల కాంబినేషన్లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రంలోని తొలి గీతం అధికారికంగా సామాజిక మాధ్యమం అయిన ‘యు ట్యూబ్’ ద్వారా విడుదల అయింది. గీత రచయిత శ్రీమణి సాహిత్యానికి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరాలూ సమకూర్చగా, గాయకుడు అనురాగ్ కులకర్ణి గాత్రంలో ప్రాణం పోసుకుందీ పాట.
 
’సింగిల్స్ యాంథమ్’ పేరుతో విడుదలయిన ఈ గీతానికి సంగీత ప్రియులనుంచి, అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన వీడియో దృశ్యాలు వాటిలోని.. నితిన్ ‘నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదిరా… కన్పిస్తుంటుంది కానీ క్యాచ్ చెయ్యలేం’ అంటూ చెప్పే సంభాషణలు, వీటికి ప్రేక్షకాభిమానుల నుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభించింది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. 
 
ఈ చిత్రం, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ … ఈ చిత్రం లోని తొలి గీతం ఈరోజు విడుదలయింది. ‘సింగిల్స్ యాంథమ్’ పేరుతో విడుదల అయిన ఈ గీతానికి ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. నితిన్, రష్మిక జంట చూడముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇప్పటికే విడుదల అయిన చిత్రం లోని వీడియో దృశ్యాలు విపరీతంగా వైరల్ అయ్యాయి. 
 
అలాగే భీష్మ ప్రచార చిత్రాలకు కూడా ప్రేక్షకాభిమానుల నుంచి విశేషమైన స్పందన లభించింది అన్నారు. ‘భీష్మ’ చిత్ర కథ, కథనాలు, సన్నివేశాలు, సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్‌కి కనెక్టయ్యేవిధంగా డిజైన్ చేసాం. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్‌కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కింగ్ నాగార్జున‌ `వైల్డ్ డాగ్‌` ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌