నా భార్య గర్భవతి కాలేదని నా బిడ్డకు తండ్రి అవుతావా?: రజనీపై భారతీ రాజా బూతు కామెంట్లు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కెమెరాల ముందు కనపడాలనే ఆరాటం ఎక్కవని, కెమెరాలు ఎక్కడుంటే అక్కడ రజనీ ప్రత్యక్షమవుతారని సినీ లెజెండ్ కమల్ హాసన్ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ రాజకీయాల్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కెమెరాల ముందు కనపడాలనే ఆరాటం ఎక్కవని, కెమెరాలు ఎక్కడుంటే అక్కడ రజనీ ప్రత్యక్షమవుతారని సినీ లెజెండ్ కమల్ హాసన్ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాడాన్ని కొందరు ఆహ్వానిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. సినీ కెరీర్ పరంగా రజనీకి సహకరించిన కమల్ హాసన్.. రాజకీయాల్లోనూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై కమల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజాగా కమల్ హాసన్ తరహాలోనే ప్రముఖ తమిళ దర్శకుడు భారతి రాజా కూడా రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ తమిళుడు కాకపోవడంతో అతనికి తమిళ రాష్ట్రాన్ని ఏలే అవకాశం ఇవ్వకూడదన్నారు. తమిళ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు పెత్తనం చెలాయించాలని చూడటంపై భారతీ రాజా ఫైర్ అయ్యారు. తాజాగా రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై బూతులు వాడారు.
ఫిల్మ్ డైరెక్టర్లు చెన్నైలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల రజనీకాంత్‌పై బూతులు, నీచాతినీచమైన కామెంట్లు చేశారు. భారతీరాజా మాటలు విని అందరూ షాక్ తిన్నారు. మే 17న మెరీనా బీచ్‌లో ఈలం వార్ బాధితులకు నివాళిగా సంస్మరణ సభను భగ్నం చేసిన పోలీసులపై భారతీరాజా ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా రజినీపై అసభ్య పదజాలాన్ని వాడారు.
తమిళ ప్రజలను పరిపాలించే మంచి తమిళ నేతలు లేరని.. అందుకే తమిళులు కాని వారు తమపై పెత్తనం చెలాయించాలనుకుంటున్నారని తెలిపారు. తమిళులకు మంచి నేతలే లేరనుకున్నా.. మీరొచ్చి ఏం చేస్తారు? నా భార్య గర్భవతి కాలేదని చెప్పి.. నా బిడ్డకు తండ్రి అయ్యేందుకు నీవు ఎవరివి? అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ విషయంలో అయినా భాగం అడగొచ్చు. కానీ నా పడకలోనూ భాగం కావాలని డిమాండ్ చేస్తే ఎలా ఒప్పుకుంటాను అంటూ.. ఘాటుగా విమర్శించారు.