Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్ స్క్రీన్‌పై కేసీఆర్ బయోపిక్... హీరోగా బాలీవుడ్ నటుడు!

వెండితెరపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. మధుర శ్రీధర్ దర్శకత్వంలో 'పెళ్లిచూపులు' నిర్మాత రాజ్ కందుకూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు

బిగ్ స్క్రీన్‌పై కేసీఆర్ బయోపిక్... హీరోగా బాలీవుడ్ నటుడు!
, బుధవారం, 31 మే 2017 (15:32 IST)
వెండితెరపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. మధుర శ్రీధర్ దర్శకత్వంలో 'పెళ్లిచూపులు' నిర్మాత రాజ్ కందుకూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. అయితే, కేసీఆర్ పాత్రను ఎవరు పోషిస్తారో అనే కుతూహలం అందర్లో నెలకొంది. 
 
ఈ ఉత్కంఠతకు దర్శకనిర్మాతలు తెరదించారు. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు ఈ సినిమాలో కేసీఆర్ పాత్రను పోషిస్తారని తెలిపారు. ఈ హీరో బాలీవుడ్ చిత్రాల్లో 'క్వీన్', 'అలీగఢ్' వంటి పలు చిత్రాల్లో నటించారు. 
 
అలాగే, శ్రుతిహాసన్ జంటగా అతను నటించిన 'బెహెన్ హోగీ తేరి' సినిమా తర్వలోనే విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పూర్తయింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జూన్ 2వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటికి దీపం ఇల్లాలైతే.. ఎలా అంటుకుంటుంది..?