జయ జానకీ నాయక హిందీ వర్షన్ మాత్రం రికార్డులు బద్దలు కొడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఒకటీ రెండు కాదు ఏకంగా 709 మిలియన్ వ్యూస్ రాబట్టింది. 702 మిలియన్ వ్యూస్‌తో కేజీఎఫ్ రెండో స్థానంలో నిలిచింది. తెలుగులో పెద్దగా ఆడని సినిమాతో పోలిస్తే వందల కోట్లు రాబట్టిన కేజీఎఫ్ వెనుకపడటం గమనార్హం.
బెల్లంకొండ శ్రీనివాస్‌కు నార్త్‌లో మంచి క్రేజే ఉంది. ఆయన నటించిన సినిమాలు హిందీ డబ్బింగ్ వెర్షన్‌లకు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. సీత, కవచం, సాక్ష్యం, స్పీడున్నోడు వంటి సినిమాలకు వందల మిలియన్లలో వ్యూస్ సాధించాయి.
ఈ క్రేజ్ నేపథ్యంలోనే నేరుగా బాలీవుడ్‌లోకి శ్రీనివాస్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఛత్రపతి రీమేక్‌తో హిందీలో డెబ్యూ ఇస్తున్నాడు. ఇటీవలే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.