Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా వెనకాల ఏడుకొండల స్వామి మా సుకుమారే - అల్లు అర్జున్

Advertiesment
Yedukondala Swami
, బుధవారం, 22 డిశెంబరు 2021 (11:05 IST)
Rashmika, arjun, sukumar
తిరుప‌తిలో పుష్ప గ్రాండ్ సక్సెస్ పార్టీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమా కోసం తాను పడిన కష్టం కంటే చిత్ర యూనిట్ ఇంకా ఎక్కువ కష్టపడ్డారు అంటూ అందరినీ ప్రశంసల్లో ముంచెత్తారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..' రెండు సంవత్సరాలుగా చిత్తూరు గురించి బాగా తెలుసుకుంటున్నాను. ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు.. వాళ్ళ భాష యాస ఎలా ఉంటుంది.. అనేది అన్ని నేర్చుకున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఒక్క ఈవెంట్ అయినా చిత్తూరులో పెట్టాలి అనుకున్నాము. అనుకున్నట్టుగానే మొదటి ఫంక్షన్ ఇక్కడ చేయడం ఆనందంగా ఉంది. సుకుమార్ అంటే సుకుమారంగా ఉంటారు అనుకుంటిరా ఫైర్.. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. పుష్ప నుంచి నాకు పేరు వచ్చిన.. ఇంకేది వచ్చిన అంతా మా సుకుమార్ గారిదే. ఇంకా ఇంతకంటే సినిమా గురించి నేనేం చెప్పలేను.
 
-  మీ వెనకాల ఆ ఏడుకొండల స్వామి ఎలా ఉన్నాడో.. నా వెనకాల మా సుకుమార్ అలా ఉన్నాడు.. ఇంతకంటే ఇంకా ఏం చెప్పాలి. మా శ్రీవల్లి కేవలం సినిమాలో మాత్రమే కాదు బయట కూడా చాలా నచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ పాటలు ఎలా ఉన్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక భాషలో కాదు అన్ని భాషల్లో ఇంత అద్భుతంగా పర్ఫామెన్స్ చేస్తుంటే థాంక్యూ తప్ప ఇంకేమీ చెప్పలేకపోతున్నాను.. బడ్జెట్ విషయంలో అన్నిట్లోనూ మాకు ఎప్పుడూ అండగా నిలిచిన మైత్రి మూవీ మేకర్స్ కు థాంక్స్. ముత్తంశెట్టి మీడియాకు కూడా నేను తిరిగి ప్రేమ చూపించే టైం వచ్చింది. సినిమాలో నాతో పాటు నటించిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్. మీరు అంత బాగా సపోర్ట్ చేశారు కాబట్టే నా పర్ఫామెన్స్ బాగుంది. సినిమా ఇంత పెద్ద విజయం అందించినందుకు మరోసారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు..' అని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలెక్షన్ల పరంగా కుమ్మేస్తున్న పుష్ప-బాహబలి రికార్డ్ బ్రేక్