Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిఫోర్ మ్యారేజ్ రిపబ్లిక్ డే నాడు రాబోతుంది

Advertiesment
Naveena Reddy

డీవీ

, మంగళవారం, 23 జనవరి 2024 (17:35 IST)
Naveena Reddy
భరత్, నవీన రెడ్డి హీరోహీరోయిన్లుగా శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వం వహిస్తున్న బిఫోర్ మ్యారేజ్ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతుంది. ఎస్.కె.యమ్.ఎల్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఆది నారాయణ ఈ చిత్రాన్ని సుమారు 100 థియేటర్ లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర‌యూనిట్ స‌భ్యులు హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు.
 
ముఖ్య అతిథి  ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. గత ఏడాది చిన్న సినిమాల హవా నడిచింది. ఈ ఏడాది 'హనుమాన్' చిత్రం కొన‌సాగించిన‌ ప్రభంజనం మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్టవ్వాలి. ట్రైలర్ చూస్తే యూత్ కు మంచి మెసేజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పాటలు బాగున్నాయి. మంచి విజ‌యం సాధించాల‌ని చిత్ర‌యూనిట్‌కు విష్ చేస్తున్నాను అన్నారు.  
 
 మ‌రో అతిథి నిర్మాత రామ్ సత్యనారాయణ మాట్లాడుతూ... ఈ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంద‌ని ట్రైల‌ర్ చూస్తేనే తెలుస్తుంది. మ్యూజిక‌ల్ హిట్‌గానూ నిలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. లేడీ ఓరియంటేడ్ మూవీ మాదిరిగా ఉంది.. హీరోయిన్ బాగా చేసింది. ఇలాంటి సినిమాల‌ను ఆదరించాలి. చిత్ర‌యూనిట్‌కు బెస్టాఫ్ ల‌క్.
 
ద‌ర్శ‌కుడు శ్రీధర్ రెడ్డి ఆటాకుల మాట్లాడుతూ.. పెళ్లికి ముందు త‌ప్పు అనిపించ‌ని పొర‌పాటు.. లైఫ్‌లో ఒక్క‌సారిగా ఊహించ‌ని మార్పులు చోటు చేసుకుంటాయని, అదే విష‌యాన్ని వాస్తవానికి దగ్గరగా సినిమాను తెరకేక్కించాము. టీమ్‌లో ప్ర‌తి ఒక్క‌రూ బాగా చేశారు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా క్వాలిటీ విష‌యంలో నిర్మాత స‌హ‌క‌రించారు. సినిమా హిట్ట‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.
 
నిర్మాత ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్న విష‌య‌మే క‌దా అని యువ‌త పెడ‌దోవ ప‌డితే ఏం జ‌రుగుతుందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించిన సినిమా ఇది. యదార్ధ సంఘటనల‌ ఆధారంగా ఈ సినిమాను నిర్మించాము. సినిమాలో సింగ‌ర్ మంగ్లీ పాడిన పాట భారీ హిట్ట‌వుతుంది. యువ‌తీయువ‌కుల‌కు మంచి మెసెజ్ ఇందులో ఉంటుంది. మా సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాము.
 
హీరో భ‌ర‌త్ మాట్లాడుతూ... మంచి కథ ఇది. అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు. ఈ త‌రం యువ‌త‌కు బాగా ఎక్కే సినిమా ఇది. సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.
 
హీరోయిన్ నవీన రెడ్డి మాట్లాడుతూ... నేను తెలుగుమ్మాయిని. ఒక సాధారణ అమ్మాయి లైఫ్‌లో జరిగే పరిస్థితులే ఈ సినిమా. టీమ్ అంతా క‌లిసి ఎంతో కష్టపడి, ఇష్టపడి సినిమా చేశాము. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.
 
నటి అపూర్వ మాట్లాడుతూ... మంచి యూత్ ఫుల్ మూవీ. మ‌ళ్లీ మ‌ళ్లీ చూసేలా సినిమా ఉంది. యువ‌త క‌చ్చితంగా సినిమాను చూసి హిట్ చేయాలి అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిద్ధార్థ్ రాయ్ లాంటి కాన్సెప్ట్ తీయాలంటే చాలా ధైర్యం కావాలి : యండమూరి వీరేంద్రనాథ్