అయోధ్యలోని రామ మందిరం "ప్రాణ్ ప్రతిష్ఠ" ఉత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని మతసామరస్యానికి ప్రతీకగా పలు ప్రాంతాల్లో జరుపుకున్నారు. ఇందులో భాగంగా ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని పలు గ్రామాలలోని ముస్లింలు మసీదుల ప్రాంగణంలో శ్రీరాముడికి ప్రార్థనలు చేశారు.
హుబ్బల్లి తాలూకాలోని హల్యాల గ్రామంలో, ముస్లిం సంఘం సభ్యులు రెండు మసీదులు, సయ్యద్ అలీ దర్గా ఆవరణలో శ్రీరాముని ఫోటోలు ఉంచి ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులకు భోజనం పెట్టి కాషాయ వస్త్రాలు ధరించారు. గదగ్ జిల్లా నరగుండ్ తాలూకాలోని హునాసికట్టి గ్రామంలో ముస్లింలు హోమాలు నిర్వహించారు. గ్రామంలోని మసీదు ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఈ కార్యక్రమంలో హిందువులు కూడా పాల్గొన్నారు. 'భారత మాత' చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉత్తర కర్ణాటక మత సామరస్యం, సోదరభావానికి ప్రసిద్ధి చెందింది. ఇతర ప్రాంతాల మాదిరిగా కాకుండా, ఉత్తర కర్ణాటకలోని గ్రామాలలో ముస్లింలు, హిందువులు పొరుగు ప్రాంతాలలో నివసిస్తున్నారు.
బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజున పుట్టిన తన బిడ్డకు ఓ ముస్లిం మహిళ రామ్ రహీమ్ అని పేరు పెట్టారు. ఫర్జానా అనే మహిళ సోమవారం ఓ మగ శిశువుకు జన్మనించిందని డిస్ట్రిక్ ఉమెన్ హాస్పిటల్ ఇన్ ఛార్జ్ డాక్టర్ నవీన్ జైన్ తెలిపారు.
తల్లిబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యకరంగానే వున్నారని చెప్పారు. హిందూ, ముస్లిం ఐక్యతకు నిదర్శనంగానే తాను బాబుకు రామ్ రహీమ్ అని పేరు పెట్టానని హుస్నా భాను స్పష్టం చేశారు.