మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటేనే నటీనటుల సంఘం. అందులో కొన్నేళ్ళుగా ఒక వర్గంగా వున్న వారంతా మరోసారి అధ్యక్షుడిగా కొత్త వారు వస్తే ఆ వర్గంలోని వారంతా ఇటువైపు వచ్చేస్తారు. తాజా ఉదాహరణ ప్రకాష్‌రాజ్ పేనల్‌లో వున్నవారంతా ఒకప్పుడు నరేష్‌ను సపోర్ట్ చేసిన వారే. ఇది ప్రజలంతా చూసి ముక్కున వేలేసుకున్నారు కూడా. అందుకే `మా`లోని పరిణామాలపై `మా` మాజీ అధ్యక్షుడు శివాజీరాజా సెన్సేషనల్ కామెంట్ చేశాడు. అదేమిటో ఆయన మాట్లలోనే.
ఇప్పుడు మా అసోసియేషన్ గురించి నేనేమి చెప్పలేను. ఎందుకంటే మంచి అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా వాడుకోవాలి. నిజానికి మురళీమోహన్ గారు ఐదు సార్లు ప్రసిడెంట్ గా చేసారు.. కానీ అయన తలచుకుంటే ఏదైనా చేయొచ్చు కానీ చేయలేదు. మురళీమోహన్ గారు అంటే నాకు చాలా ఇష్టం, కానీ అయన ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు అని నా అభిప్రాయం. నేను మా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నేను రాజేంద్ర ప్రసాద్ డబ్బులు, ఫోన్స్ పంచామని ప్రచారం చేసారు. ఇక్కడ కొందరు బీరు, బిర్యానీలకు కక్కుర్తి పడి పార్టీలు మారుస్తారు. అలాంటి వారికోసం నేను ఎందుకు కష్టపడాలి అనిపించేది. ప్రస్తుతం నేను ఫిలిం కల్చరల్ క్లబ్ (ఎఫ్ ఎం సిసి క్లబ్) కు హయ్యెస్ట్ మెజారిటీ తో గెలిచి వైస్ ప్రసిడెంట్ గా ఉన్నాను. కానీ ఇక్కడ నేను ఏమి చేయడం లేదు.. పెద్దలు ఉన్నారు ఆదిశేష గిరిరావు, కె ఎస్ రామారావు లాంటి వారు ఉన్నారు, వారు అన్ని చూసుకుంటారు.