Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగ‌బాబు ఒరిజిన‌ల్స్ లో `బ‌స్తీ బోయ్స్` వెబ్ సిరీస్

Advertiesment
నాగ‌బాబు ఒరిజిన‌ల్స్ లో `బ‌స్తీ బోయ్స్`  వెబ్ సిరీస్
, బుధవారం, 21 ఏప్రియల్ 2021 (18:56 IST)
Nagababu gully boys
స్టేజ్ మీద `గల్లీ బాయ్స్`, `రౌడీ బాయ్స్` అంటూ స్కిట్స్ చేసిన కుర్రాళ్ల‌తో మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు వెబ్ సిరీస్ తెర‌కెక్కిస్తున్నారు. బ‌స్తీ బాయ్స్ అనేది టైటిల్. దీనికి ఆయ‌నే కాన్సెప్ట్ అందించి ఇన్ఫినిటంతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఓటీటీల్లో  కాకుండా దీనిని నాగబాబు ఒరిజిన‌ల్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.
 
నాగబాబు మాట్లాడుతూ ``సద్దాం-యాదమ్మ రాజు-భాస్కర్ - హరి (అదిరింది టీమ్) కలిస్తే కామెడీ బావుంటుందని ఆ న‌లుగురితో బస్తీ బాయ్స్ అనే వెబ్ సిరీస్ నిర్మించాం. తాము ఇన్ఫినిటం తో కలిసి ఈ సిరీస్ తీస్తున్నాం. ఈ కంటెంట్ ఏ OTT కి వెళ్లినా డిమాండ్ బావుంటుంది. కాకపోతే ఇది అందరికి అందించాలనే ఉద్దేశంతో ఎలాంటి సబ్ స్క్రిప్షన్ చార్జెస్ లేకుండా నా యూ ట్యూబ్ ఛానెల్ అయిన `నాగబాబు ఒరిజినల్స్`లో రిలీజ్ చేస్తున్నాం. ఈ సిరీస్ కి టీవీ లానే చాలా ఎక్కువ ఖర్చు చేసి తీశాం. సిరీస్ హిట్ అయితే మరిన్ని సీజన్స్ చేసే ఆలోచనలో ఉన్నాం. ఈ సిరీస్ కి కాన్సెప్ట్ నేను బుల్లెట్ భాస్కర్ కలిసి తయారు చేసుకున్నాం. బుల్లెట్ భాస్కర్ డైరెక్ట్ చేసాడు`` అని చెప్పారు. ఈ సందర్భంగా సద్దాం- హరి- రాజు భాస్కర్ పై ప్రశంసలు కురిపించారు నాగబాబు. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 27 సాయంత్రం 6 గంటల నుండి అందుబాటులో ఉంటుంది అని చెప్పారు.
 
యాదమ్మ రాజు మాట్లాడుతూ-``మేము ఖాళీగా ఉన్నప్పుడు నాగబాబు గారే పిలిచి 'అదిరింది' లో ఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసారు. ఆ తరువాత కూడా నాగబాబు గారే మేము ఖాళీగా ఉండొద్దు అని మళ్ళీ ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసారు. అందుకు మీకు థాంక్స్ సార్. ఈ వెబ్ సిరీస్ చాలా బాగా వచ్చింది. అందరూ ఈ వెబ్ సిరీస్ చూసి ఎంకరేజ్ చెయ్యండి అన్నారు.
 
ఎక్స్ ప్రెస్ హరి మాట్లాడుతూ, టాలెంట్ చాలా మందికి ఉంటుంది, కానీ దాన్ని గుర్తించి సపోర్ట్ చేసే వాళ్ళలో నాగబాబు గారు ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. గతంలో మేము స్టేజ్ మీద గల్లీ బాయ్స్, రౌడీ బాయ్స్ స్కిట్స్ చేశాం. ఏడాదిగా ఆపేశాం. దాంతో చాలామంది గల్లీ బాయ్స్, రౌడీ బాయ్స్ ఎక్కడ? వాళ్ళ కామెడీ ఎక్కడ అని అడిగారు. ఇప్పుడు చెబుతున్నా, మీరు సంవత్సరం నుండి వెయిట్ చేస్తున్న మీ కామెడీ ఆకలి తీర్చే ఫుల్ మీల్స్ మా బస్తీ బాయ్స్. మీరు ఎక్స్పెక్ట్ చేసినదానికంటే ఎక్కువ నవ్వుతారు. గల్లీ బాయ్స్ -డీ బాయ్స్ కి మించి కామెడీ మా బస్తీ బాయ్స్ లో చూస్తారు. అదిరింది టైమ్ లో స్కిట్స్ చేసాక సార్ ఇచ్చిన ఐడియాస్ బాగా హెల్ప్ అయ్యాయి. అలాంటిది ఇప్పుడు నాగబాబు గారి హయాంలోనే చేసిన బస్తీ బాయ్స్ లో కామెడి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి. సార్ పిలిచి బస్తీ బాయ్స్ చేద్దాం అన్నప్పుడు నేను చాలా ఎక్సయిట్ అయ్యా. అలాంటిది షూటింగ్ అయ్యి, డబ్బింగ్ అయ్యి ఇప్పుడు చూసాక చెబుతున్నా, ఇది గల్లీ బాయ్స్, రౌడీ బాయ్స్ ని మించి ఉంటుంది. ఎక్కడా తగ్గేదే లే...ఇది 8, 9 సిరీస్ వరకు వెళుతుంది అన్నారు.
 
పటాస్ భాస్కర్ మాట్లాడుతూ, మేం నలుగురం ఐదేళ్ళ‌నుంచి కలిసున్నాం. ఏడాది గ్యాప్ వచ్చింది. ఇక అయిపోయింది అనుకున్నవాళ్ళకి  ఈ బస్తీ బాయ్స్ మళ్ళీ కమ్ బ్యాక్ ఇస్తుంది. మేం చేసే చిల్లర పనులన్నీ ఈ ఎపిసోడ్ లో ఉంటాయి. మేం షూటింగ్ లో చేసే పనులన్నీ ఈ వెబ్ సిరీస్ లో ఉంటాయి. ఇంట్లో ఎలా ఉంటామో, బయట ఎలా ఉంటామో ఈ సిరీస్ లో కూడా అలానే ఉంటాం. చేసేటప్పుడు మాకే అనిపించింది.బుల్లెట్ భాస్కర్ ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంటాడు. డైరెక్టర్ గా హెల్ప్ చేసిన బుల్లెట్ భాస్కర్ అన్నకి థాంక్స్`` అన్నారు.
 
సద్దాం మాట్లాడుతూ,  దీన్ని బయట ఎవరికి ఇచ్చినా కూడా మంచి అమౌంట్ వస్తుంది. కానీ అందరికి అందుబాటులో ఉండాలని ఫ్రీ గా రిలీజ్ చేస్తున్నారు. మీకు గల్లీ బాయ్స్ తెలుసు. రౌడీ బాయ్స్ తెలుసు. వాళ్లిద్దరూ కలిపితే ఈ బస్తీ బాయ్స్. ఇది మా నలుగురి కాంబినేషన్ లో చేస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్. మేం డబ్బింగ్ చెప్పేటప్పుడే చాలా నవ్వుకున్నాం. రిలీజ్ అయితే మీరు కూడా అలానే నవ్వుకుంటారు. మేం నలుగురం కలిస్తే మీ కామెడీ టైమింగ్ చాలా బావుంటుంది. ఈ సిరీస్ లో ఇంకా పేరు వస్తుంది అని ఈ సిరీస్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటుంన్నాం అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‌`అఖండ` ఆద‌ర‌ణతో టీజ‌ర్‌, 30తో షూటింగ్ పూర్తి