హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి హీరో బాలకృష్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. రాజకీయాల్లో రాణిస్తున్నారు. సినిమాల్లో నటించడం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేసే బాలయ్య ప్రకటనల జోలికి మాత్రం వెళ్లరు. టాలీవుడ్‌లో మహేష్ బాబు, నాగార్జున, అల్లు అర్జున్, రవితేజ, ఎన్టీఆర్, వెంకటేష్ ఇలా ఎందరో వాణిజ్య ప్రకటనల్లో మెరిసిపోతుంటే.. బాలకృష్ణ మాత్రం ప్రకటనల్లో మాత్రం కనిపించరు.
ఎందుకో తెలుసా? అయితే చదవండి.. తెదేపా వ్యవస్థాపకులు, సినీ నటుడు ఎన్టీఆర్ ఏనాడు తన ఇమేజ్‌ను అడ్డం పెట్టుకుని వాణిజ్య ప్రకటనల్లో కనిపించలేదన్నారు. నాన్నగారి నుంచి నేర్చుకున్న లక్షణమని.. ఆయన బాటలోనే తాను నడుస్తున్నానని తెలిపారు.
ప్రేక్షకుల ద్వారా వచ్చిన ఇమేజ్‌తో వారిని సంతోషపెట్టాలే కానీ.. స్వార్థం కోసం సొమ్ము చేసుకోకూడదన్నారు. ఒకవేళ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తే ప్రజలకు ఏమైనా మేలు చేకూరుతుందంటే చేస్తాను తప్ప.. అదే పనిగా డబ్బు కోసం మాత్రం చేయను. తనవద్ద ఉన్న డబ్బే చాలునని ఎన్టీఆర్ అన్నారు.