గబ్బర్ సింగ్ సినిమా గోల్డెన్ లెగ్‌గా మారిన శ్రుతిహాసన్ ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో బిజీ బిజీ అయ్యింది. శ్రీమంతుడు హిట్‌తో అమ్మడు బాలీవుడ్ ఆఫర్లలో మెరిసిపోతోంది. బాలీవుడ్‌లోనే మకాం వేసిన శ్రుతిహాసన్ టాలీవుడ్‌కు దూరం కానుందని వార్తలు వస్తున్నాయి. తాను టాలీవుడ్ సినిమాలు చేయడం లేదని చెప్తోంది. శృతి హసన్ తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో కూడా ఫుల్ బిజీగా ఉండటంతో.. కాల్షీట్ల కారణంగా ప్రస్తుతానికి తెలుగు సినిమాలను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్‌పై పూర్తిగా ఫోకస్ పెట్టిన శ్రుతిహాసన్.. ఒకే టైములో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చేయడం కష్టంగా ఉందని.. అందుకే టాలీవుడ్‌కు చిన్న బ్రేక్ ఇవ్వాలనుకుంటుందని తెలిసింది. బాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్ కోసం శ్రుతిహాసన్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోందని.. అందుకే తన తొలి సినిమా అక్కడ నుంచే ప్రారంభించినట్లు సమాచారం. మరి శ్రుతిహాసన్ బాలీవుడ్‌లో పాగా వేస్తుందో లేక దక్షిణాదికే వచ్చేస్తుందో తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.