నందమూరి బాలకృష్ణ 'లెజెండ్' 1005 డేస్ క్రాస్ చేశాడు!
నందమూరి బాలకష్ణ ప్రతిష్టాత్మక చిత్రం 'గౌతమిపుత్రశాతకర్ణి'. సోమవారం తిరుపతిలోని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున, నందమూరి అభిమానులు
నందమూరి బాలకష్ణ ప్రతిష్టాత్మక చిత్రం 'గౌతమిపుత్రశాతకర్ణి'. సోమవారం తిరుపతిలోని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున, నందమూరి అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేని విధంగా చిత్ర నిర్మాతలు నిర్వహించారు. అందుకోసమే అన్ని ఏర్పాట్లు చాలా ప్రత్యేకంగా చేశారు. అదేసమయంలో బాలయ్య నటించిన 'లెజెండ్' సినిమా పొద్దుటూరులో 1005వ రోజుకు సోమవారానికి చేరుకుంది.
అందుకే ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. దాన్ని తిరుపతిలోని కార్యక్రమం జరిగేచోట ఏర్పాటుచేశారు. కాగా, గౌతమి.. ఆడియోను అందరూ చూసేందుకు వీలుగా 100 అడుగుల ఎత్తున్న ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అభిమానులకు, అతిథులకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ఉండేలా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఫ్యాన్స్ అధ్యక్షుడు తెలియజేశాడు.