ఒక వ్యక్తిగా, నటుడిగా నాకు మా నాన్నగారు స్ఫూర్తి. ఆయన తర్వాత నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి మోహన్‌బాబుగారే.. క్రమశిక్షణతో దృఢసంకల్పంతోను అనుకున్న దారిలో ముందుకుసాగే వ్యక్తిగతంగా ప్రత్యేక గుర్తింపుపొందారాయన.. అని నందమూరి బాలకృష్ణ అన్నారు.
ఆయన డైలాగ్ డిక్షన్ అద్భుతం. 'సర్దార్ పాపారాయుడు' సినిమాలో నాన్నగారితో కలిసి నటించినప్పుడు మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు.. లాంటి డైలాగ్‌లు ఎంతో అద్భుతం. నటనలోకావచ్చు, డైలాగ్‌డెలివరీలో కావచ్చు, ఎంతో మంది ఆయన్ను అనుకరించి బ్రతికారు కూడా. ఇలా తనదైన ముద్ర వేసుకున్న మోహన్‌బాబు పద్మశ్రీ కూడా సాధించుకుని 40 సంవత్సరాల నట జీవితాన్ని పూర్తిచేసుకున్న ఆయన.. తన సినిమాల్లోని డైలాగ్‌తో 'డైలాగ్ బుక్' విడుదల చేసిన సందర్భంగా ముందుమాట రాయడం నాకు గర్వంగా ఉందని.. తెలిపారు. ఈ పుస్తకాన్ని ఇటీవలే బ్రిటన్ పార్లమెంట్‌లో ఆ బుక్ ఆవిష్కరించారు.