Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి 150వ చిత్రం తీసుకోవాలా...? హహ్హహ్హ్హ... హిహ్హిహ్హ్హి... చూద్దాం... దిల్‌ రాజు ఇంటర్వ్యూ

Advertiesment
Dil Raju interview
, శుక్రవారం, 13 మే 2016 (18:28 IST)
దిల్‌ సినిమాతో ఇంటి పేరుగా మార్చుకుని.. దిల్‌ రాజుగా ఇండస్ట్రీలో మెలుగుతున్న ఆయన కొత్తబంగారులోకం, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలు తీసి జనాల్లోకి వెళ్ళిపోయారు. అయితే కమర్షియల్‌ మాస్‌ చిత్రాలు తీసినా.. చాలామంది ఇంకా ఆ మూడు సినిమాల గురించే ఆడుతున్నారు. అలాంటి సినిమా ఎప్పుడొస్తుందా..అంటూ విదేశాల్లోకూడా ప్రశ్నిస్తున్నారనీ.త్వరలో నా బేనర్‌లో అలాంటి సినిమా వస్తుందని చెబుతున్నాడు. ఇటీవలే ఆయన చేసిన 'సుప్రీమ్‌' విడుదలై మంచి కలెక్షన్లతో రన్‌ అవుతుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ..
 
ఈమధ్య సక్సెస్‌మీట్‌లతో ఫేక్‌ రిపోర్ట్స్‌తో నిర్మాతలు మీడియాను వాడుకుంటున్నారు. మీరెలా భావిస్తారు?
నేను ఎప్పుడూ సినిమా ఫెయిల్‌ అయిందే.. నా సినిమా పోయింది అని చెబుతాను. తర్వాత ప్రెస్‌ ముందు కన్పించను. కొందరైతే అలా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఒకరకంగా నేను వ్యతిరేకం. కానీ కొన్నిసార్లు తప్పనిపరిస్థితుల్లో నిర్మాత మీడియా ముందుకు రావాల్సి వస్తుంది. అదెలాగంటే.. పేషెంట్‌.. ఆసుపత్రిలో చేరాక.. బతుకుతాడనే ఆశతో వున్నట్లే. సినిమా విడుదలయ్యాక కలెక్షన్లు డల్‌గా వుంటే.. డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి మేరకు ఎగ్జిబిటర్ల ప్రెజర్‌ వల్ల.. మీడియా ముందు సినిమా గురించి గొప్పగా చెప్పాల్సివస్తుంది. దానివల్ల కొద్దిలోకొద్దిగైనా టిక్కెట్లు తెగుతాయనే ఆశ మాత్రమే.
 
సుప్రీం సినిమా రిజల్ట్‌ ఎలా వుంది?
సినిమా విడుదలైన రోజు నాకు ఎప్పుడూ ఫోన్‌ చేసి చెప్పే ఐదుగురు ఫ్రెండ్స్‌ రిపోర్ట్‌ ఆధారంగా చేసుకుంటాను. ఇద్దరు ఫోన్‌ చేసి.. బాగానే వుంది. ఆడుతుంది అన్నారు. ముగ్గురు చేయలేదు. దాంతో ఎక్కడో తేడా వుందనిపించింది. అందుకు నేనే హైదరాబాద్‌లో ఓ థియేటర్‌కు వెళ్ళి చూశాను. ప్రేక్షకులు రెస్సాన్స్‌ బాగుంది. కామెడీని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. దర్శకుడుతో చెప్పాను. సినిమా నిదానంగా పుంజుకుంటుంది. ఏం భయంలేదని, అలాగే.. మూడు రోజుల తర్వాత సోమవారం నుంచి కలెక్షన్లు నిలబడ్డాయి.
 
దర్శకుడు చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
దర్శకుడు అనిల్‌ కథ చెప్పినప్పుడు అందులో కామెడీ నచ్చింది. అంతా వేరే పనిలో సీరియస్‌గా వుంటే ఒక క్యారెక్టర్‌.. ఆ కాపీ.. అంటూ అరుస్తాడు.. ఇది బాగా నచ్చింది. గతంలో జంధ్యాల సినిమాల్లో వుండే ఫార్మెట్‌ అలాంటివి బాగా కనెక్ట్‌ అయ్యాయి.
 
'కృష్ణాస్టమి' చాలా కాన్ఫిడెంట్‌గా హిట్‌ అన్నారు.. కానీ?
దాన్ని.. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అంటాను. నేను ఎక్కువగా మాట్లాడాను. కానీ సినిమా చూశాక.. జనాలు వద్దన్నారు. సునీల్‌కు కొత్తగా వుంటుందని ప్రయోగం చేశాను. బెడిసి కొట్టింది.
 
సుప్రీం సినిమాకు సమర్పణ అని వేసుకున్నారు?
అవును.. నేను ఒకేసారి రెండుమూడు సినిమాలు చేయడంతో.. వాటి బాధ్యతల నుంచి తప్పుకుని శిరీష్‌, లక్ష్మణ్‌లకు అప్పగించాలని అలా చేశాను. ఒక్కసారి కథ వింటాను. ఓకే అనగానే.. వాళ్ళిద్దరూ దాని వ్యవహారాలు చూసుకుంటారు. ఇలా చేయమని అల్లు అరవింద్‌ సజెషన్‌ ఇచ్చారు.
 
మీకు రాముడు, కృష్ణుడు.. పేరుతో వున్న సినిమాలు నష్టాలు మిగిల్చాయే?
అవును.. నాకు కలిసిరాలేదు. రామరామ కృష్ణకృష్ణ.. రామయ్య వస్తావయ్యా... కృష్ణాస్టమి.. మూడు సినిమాలు నాకు వర్కవుట్‌ కాలేదు. నేను వేంకటేశ్వరస్వామి భక్తుడ్ని. నా పేరుమీద కాకుండా.. రాముడు, కృష్ణుడు.. పేరు పెట్టావేమిటని అనుకున్నాడేమో.. (నవ్వుతూ).. మూడు నష్టాలు ఇచ్చాయి. 
 
నాగార్జున వెంకటేశ్వర స్వామి సినిమా తీసుకుంటున్నారా?
ఏమీ చెప్పలేం. దాన్ని రాఘవేంద్రరావు చూసుకుంటున్నారు.
 
కబాలి.. డిస్ట్రిబ్యూషన్‌ ఎంతవరకు వచ్చింది?
దానికోసం ట్రై చేస్తున్నాం.. కానీ రేటు బాగా ఎక్కువగా వుంది. చూద్దాం ఏమవుతుందో.
 
సుప్రీంలో కథ లేదని కొందరు విమర్శించారు?
అవును.. అందులో కథే లేదు. ఓ టాక్సీవాలా.. ఓ కుర్రాడిని కాపాడతాడు. అతని కోరిక తీరుస్తాడు. ఇది పెద్ద కథకాదు.. కానీ.. దాన్ని చెప్పే విధానంలో కొత్తదనం ప్రేక్షకులు కోరుకుంటున్నారు. దిల్‌రాజు అనే పేరు వుండగానే.. ఏదో కొత్తదనం వుంటుందని భావిస్తున్నారు. అందుకే సినిమాలు కథ లేకుండా హిట్‌ అవుతున్నాయి.
 
కాంబినేషన్‌లు ఎంతవరకు కరెక్ట్‌?
ఒక్కోసారి కాంబినేషన్‌లు ఒక దశవరకే వర్కవుట్‌ అవుతాయి. అన్ని కాంబినేషన్‌లు వర్కవుట్‌ అయితే.. ఎన్‌టిఆర్‌.. రామయ్య వస్తావయ్య.. ఫెయిల్‌ కాకూడదు.. కనుక ఇక్కడ కాంబినేషన్‌లు కాదు.. ఇండస్ట్రీలో ఏది ఎప్పుడు జరుగుతుందో ఏది కరెక్టో చెప్పలేం. పవన్‌తో సినిమా తీయాలి.. కానీ కుదరలేదు. ఇలా చాలావరకు మనకు వచ్చింది చేసుకుంటూపోవడమే.. కొన్ని సినిమాలు మొదలుపెడతాం.. అన్నీ ముహూర్తాలు బాగుంటాయి. కానీ రెండు రోజులు షూటింగ్‌ తర్వాత వేరే కారణంతో ఆగిపోతుంది. ఇది అలానే ఎందుకు మనకు జరగాలి అనుకుంటే.. సినిమాలు చేయలేం. ఇదో వింత ప్రపంచం.
 
చిరంజీవి సినిమా తీసుకుంటారా?
(గట్టిగా నవ్వుతూ..) చూద్దాం.. అంటూ దాటవేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్‌ బాబు ఓల్డ్‌ అయ్యాడంటున్న కాజల్‌... ఎంత ధైర్యం...?