Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊహాగానాలకు తెరదించిన మెగాస్టార్ - యువరత్న!!

Advertiesment
chiranjeevi - balakrishna

ఠాగూర్

, ఆదివారం, 25 ఆగస్టు 2024 (09:44 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, యువరత్న నందమూరి బాలకృష్ణ. గత కొద్ది రోజులుగా వీరిద్దరి కలయికపై ఏవేవో ఊహాగానాలు వస్తున్నాయి. వీటికి తాజాగా వీరిద్దరూ తెరదించారు. శుక్రవారం ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కుమారుడు వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలు హాజరయ్యారు. ఆ తర్వాత వధూవరులను ఆశీర్వదించేందుకు చిరంజీవి వెళ్లుతోన్న క్రమంలో ఆయనను సోదరా అని బాలయ్య బాబు పిలిచారు. మీరు నా గురించి ఎన్నో మంచి మాటలు చెప్పారట.. చాలా సంతోషం‌ అని చిరంజీవితో బాలయ్య బాబు అన్నారు. 
 
కొద్దిసేపు మాట్లాడుకున్న వారిమధ్య మీరు నా అన్ స్టాపబుల్ షోకి రావాలని చిరంజీవి‌ని అడిగేశారు. వెంటనే చిరంజీవి కూడా ఖచ్చితంగా వస్తానని బాలయ్యకు మాటిచ్చెసారట. దశాబ్దాలుగా ప్రొషెషనల్‌గా పోటీపడిన ఈ ఇద్దరు హీరోలు... ఒకేసారి వీరి సినిమాలు రిలీజ్ అయితే అభిమానుల మధ్య ఎలాంటి పరిస్దితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
అలాగే, చిరంజీవి వర్సెస్ బాలయ్య అంటూ రకరకాల కథనాలు, ఊహాగానాలు ఎన్నో చూశాం. కానీ వాటన్నింటినికి పుల్ స్టాప్ పెడుతూ శుక్రవారం చిరంజీవి - బాలయ్య బాబుల మధ్య ఓ స్నేహపూర్వక సందర్భం వెలుగు చూసింది. త్వరలో నటుడిగా స్వర్ణోత్సవ వేడుకను జరపుకోబోతున్న బాలకృష్ణ వేడుకకు చిరంజీవి విశిష్ట అతిథిగా హాజరవబోతున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగస్టు 29న పోతారు. అందరూ సరిపోదా శనివారం' థియేటర్ కు పోతారు: నాని