Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

101వ సినిమా: 70 ఏళ్లు పైడిన రైతు గెటప్‌లో బాలయ్య అదరగొడతాడా?

నందమూరి బాలయ్య వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సంక్రాంతికి రిలీజ్ కానున్న నేపథ్యంలో.. బాలయ్య 101వ సినిమాపై దృష్టి పెట్టేశాడు. ఈ సినిమాను కృష్ణవంశీ తెరెకెక్కిస్తున్నారు. రాష్ట్రంలోని రైతు జీవితం ఆధార

Advertiesment
Balakrishna 101 Film With Amitabh Bachchan In Rythu
, గురువారం, 27 అక్టోబరు 2016 (13:32 IST)
నందమూరి బాలయ్య వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సంక్రాంతికి రిలీజ్ కానున్న నేపథ్యంలో.. బాలయ్య 101వ సినిమాపై దృష్టి పెట్టేశాడు. ఈ సినిమాను కృష్ణవంశీ తెరెకెక్కిస్తున్నారు. రాష్ట్రంలోని రైతు జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘రైతు’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారని సమాచారం. ఇకపోతే ఈ చిత్రంలో బాలయ్య 70 ఏళ్ళు పైబడిన రైతు గెటప్‌లో కనిపించబోతున్నాడట. 
 
ఇంతకు మునుపు కూడా బాలయ్య ‘ఒక్కమగాడు’ వంటి చిత్రాల్లో వయసు పైబడ్డ వ్యక్తిగా కనిపించినప్పటికీ ఈ రైతు సినిమాలో గెటప్ మాత్రం చాలా సహజంగా, ప్రత్యేకంగా ఉంటుందట. బాలయ్య చేస్తున్న ఈ ప్రయోగం ఆయన కెరీర్లోనే ప్రత్యేకమని సినీ జనం చెప్పుకుంటున్నారు. ఈ చిత్రాన్ని ఓ పాపులర్ సంస్థ నిర్మిస్తుందని తెలిసింది. 
 
ఇప్పటికే బాలయ్య, కృష్ణ వంశీ కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌లో ఉన్న అమితాబ్ ను కలిసినప్పటి నుండి బాలయ్య 101వ సినిమాలో అమితాబ్ నటించనున్నాడని కూడా ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''కాళరాత్రి''లో దెయ్యాలు రేప్ చేస్తాయా?