Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘బాహుబలి-2’ ని విజువల్ రియాల్టీలో చూస్తే కొత్త ప్రపంచంతో కనువిందు

బాహుబలి-2 చిత్రాన్ని విజువల్‌ రియాల్టీలో చూడడం ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుందని ‘బాహుబలి-2’ చిత్రం సాంకేతిక నిపుణుడు కరుణాకరన్‌ చెప్పారు. చిత్రాన్ని మనం త్రీడీలో కూడా చూసే అవకాశం ఉన్నా దానికన్నా విజువల్‌ రియాల్టీలో చూసే విధంగా దీన్ని అత్యాధునిక టెక్న

‘బాహుబలి-2’ ని విజువల్ రియాల్టీలో చూస్తే కొత్త ప్రపంచంతో కనువిందు
హైదరాబాద్ , మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (04:09 IST)
బాహుబలి-2 చిత్రాన్ని విజువల్‌ రియాల్టీలో చూడడం ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుందని ‘బాహుబలి-2’ చిత్రం సాంకేతిక నిపుణుడు కరుణాకరన్‌ చెప్పారు. చిత్రాన్ని మనం త్రీడీలో కూడా చూసే అవకాశం ఉన్నా దానికన్నా విజువల్‌ రియాల్టీలో చూసే విధంగా దీన్ని అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించినట్లు వివరించారు. బాహుబలి–2 చిత్రంలో ఉపయోగించిన అత్యాధునికమైన టెక్నాలజీని ప్రతి ఒక్కరికీ చూపించేలా తమ టీం సభ్యులు రాష్ట్రమంతా ప్రముఖ నగరాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. 
 
త్రీడీ చిత్రాల్లో మన దగ్గరకు చిత్రం వచ్చినట్లు ఉంటుందని, అదే విజువల్‌ రియాల్టీ (వీఆర్‌)లో మనమే చిత్రంలోని పాత్రల్లోకి వెళ్లి, వాటి అనుభూతిని పంచుకున్నట్లు ఉంటుందని కరుణాకరన్ చెప్పారు. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి–2’ విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్రం సాంకేతిక బృందం సోమవారం నాగమల్లితోట జంక్షన్‌ సమీపంలోని లాల్‌బహుద్దూర్‌ నగర్‌ మిర్చి రెస్టారెంట్‌లో విజువల్‌ రియాల్టీ ఎఫెక్ట్స్‌ను ప్రదర్శించారు.
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరుణాకరన్‌ మాట్లాడుతూ చిత్రం ప్రచారంలో భాగంగా ప్రముఖ నగరాల్లో టెక్నికల్‌ సిబ్బంది ఆధ్వర్యంలో 56 సెకన్లతో కూడిన గ్రాఫిక్స్‌ను ప్రేక్షకులకు చూపిస్తున్నట్లు వివరించారు. బాహుబలి-2 చిత్రాన్ని విజువల్‌ రియాల్టీలో చూడడం ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుందన్నారు.

దేశవ్యాప్తంగా 400 సెంటర్లలో బాహుబలి–2 విడుదల కానున్నట్లు  తెలిపారు. ఇప్పటి వరకు విజయవాడ, గాజువాక, విశాఖపట్నం ప్రాంతాల్లో విజువల్‌ రియాల్టీ ఎఫెక్ట్స్‌ను ప్రదర్శించామని, ఇప్పుడు కాకినాడ, రాజమండ్రిల్లో ప్రదర్శిస్తున్నామని తెలిపారు. 
 
ఇప్పటి వరకూ దేశంలో150 డిగ్రీలు మించని తెరలపైనే చిత్రాలను చూడగలిగామని, రానున్న రోజుల్లో 360 డిగ్రీల్లో ఈ చిత్రాన్ని చూసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి థియేటర్లు తయారు చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, అంతేకాక సమయం కూడా ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుందని అన్నారు. చిత్రం విడుదలకు ముందే 15 నిమిషాల నిడివిగల షార్టు ఫిల్మ్‌ను సెన్సార్‌ కెమెరా ద్వారా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండూ వేశాను మేడమ్.. కానీ అది తినేసింది...