Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలి నటీనటులకు నీరాజనాలు సరే... ఆ పిల్ల బాహుబలిని మర్చిపోయారా?

బాహుబలి సినిమాలో నటించిన ప్రతి పెద్ద, చిన్న నటీనటులకు జీవిత కాలం మరవలేని మధుర జ్ఞాపకాలను అందించింది. మరి తొలిభాగంలో సినిమా మొదలెట్టగానే వచ్చే సీన్‌లో కనబడి కోట్లమందిని విభ్రమానికి గురి చేసిన పిల్ల బా

బాహుబలి నటీనటులకు నీరాజనాలు సరే... ఆ పిల్ల బాహుబలిని మర్చిపోయారా?
హైదరాబాద్ , గురువారం, 4 మే 2017 (03:20 IST)
బాహుబలి సినిమాలో నటించిన ప్రతి పెద్ద, చిన్న నటీనటులకు  జీవిత కాలం మరవలేని మధుర జ్ఞాపకాలను అందించింది. మరి తొలిభాగంలో సినిమా మొదలెట్టగానే వచ్చే సీన్‌లో కనబడి కోట్లమందిని విభ్రమానికి గురి చేసిన పిల్ల బాహుబలి పాత్ర ధారికి బాహుబలి ఏమిచ్చింది అంటే ఏమీ ఇవ్వేలేదు. కాని కొన్ని కోట్లమంది తల్లులు దేశంలో తమ పిల్లలను కూడా శివగామిలా ఎత్తిపట్టుకుని అరిచినటువంటి మర్చిపోని జ్ఞాపకాలను ఆ పిల్లబాహుబలి ఇచ్చాడు. కృష్ణా, గోదావరి పుష్కరాలు వరుసగా వచ్చినప్పుడు పుష్కర స్నానాలు చేసిన తల్లులు తమ పసికందులను శివగామి బాహుబలిని ఎత్తిన రీతిలో నదిలో నిలబడి పైకి ఎత్తినప్పుడు ఆ రియల్ బాహుబలులను చూసి జనం వెర్రెత్తిపోయారంటే అతిశయోక్తి కాదు. బాహుబలి ది బిగినింగ్ మహాద్భుత విజయానికి నాంది పలికిన మనోహర దృశ్యంలో అలా శివగామి చేతుల్లో పైన వేలాడిన ఆ పిల్ల బాహుబలి ఎవరు? ఇప్పుడు ఎక్కడున్నాడు? 
 
ఐదేళ్ల కిందట విడుదలైన బాహుబలి ఫస్ట్ లుక్ లో.. శివగామి(రమ్యకృష్ణ) చేతిలో పొద్దికగా ఒదిగి, భవిష్యత్తును శాసించబోతున్నంత ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన ఆ పసికూన గురించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రభాస్ కాకుండా ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన ఒకేఒకరు ఈ పసికునే కావడం మరో విశేషం! ఫస్ట్ లుక్ లోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బాహుబలి.. భారతీయ సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.  
 
బాహుబలి ది బిగినింగ్ లో శివగామి.. మహేంద్ర బాహుబలి (శివుడు)ని ఎత్తుకుని నదిలో ఉన్నప్పుడు చూపించింది, ఆ తరువాత ఫ్లాష్ బ్యాక్ లో అమరేంద్ర బాహుబలిగా శివగామి చేతి వేలిని పట్టుకున్నప్పుడు చూపించింది, బాహుబలికన్ క్లూజన్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్లలో.. మహేంద్ర బాహుబలిగా శివగామి పసికందును ప్రజలకు చూపించింది, కట్టప్ప తన తలపై కాలును పెట్టుకున్నప్పుడు చూపించిన పసికందునే! 
 
అయితే షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఈ బుజ్జాయి నిజానికి అబ్బాయి కాదు.. అమ్మాయి! పేరు అక్షర! బాహుబలిలో నటించే సమయానికి అక్షర వయసు జస్ట్ 18 రోజులు మాత్రమే! ఇంతకీ ఈమెకు బాహుబలిలోకి ఎలా తీసకున్నారంటే.. అదో పెద్ద కథ.
 
కేరళలోని అతురపల్లి జలపాతాల  దగ్గర బాహుబలి షూటింగ్ జరిగినప్పుడు స్థానికుడైన వల్సన్ అనే ఓ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆ సినిమాకు పనిచేశాడు. ఆ సమయంలోనే వల్సన్ దంపతులకు అక్షర జన్మించింది. బాహుబలి ప్రొడక్షన్ లో కీలక పాత్రపోశించిన శ్రీవల్లి ద్వారా ఆ పాప గురించి దర్శకుడు రాజమౌళికి తెలిసింది. 
 
నిజానికి అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలు పసికందులుగా చూపించేటప్పుడు గ్రాఫిక్స్ ను వినియోగించాలని అనుకున్న జక్కన్న.. అక్షరను చూశాక మనసుమార్చుకున్నాడు. అలా ఆమె సినిమాలో కాలుమోపడం, ఫస్ట్ లుక్ లోనే ప్రభంజనం సృష్టించడం, ఆ తర్వాతి విషయాలు తెలిసినవే. 
 
కాగా, ప్రస్తుతం కేరళలోనే చదువుకుంటున్న అక్షర వేసవి సెలవుల్ని ఎంజాయ్ చేస్తోంది.. ఈ పిల్ల బాహుబలి అక్షరకు శుభాభినందనలు తెలియ చేద్దామా మరి!
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు ప్రజల ఉనికిని తెలుపడానికి అప్పుడు అన్నయ్య ఎన్టీఆర్.. ఇప్పుడు రాజమౌళి.. మోహన్ బాబు ప్రశంస