Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాలో బాహుబలి2 టీమ్! త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలు.. 4 వేల థియేటర్లలో విడుదల

సెప్టెంబర్‌లో చైనాలో రిలీజ్ కానున్న చైనీస్ వెర్షన్ ప్రమోషన్స్ కోసం ఈ బాహుబలి స్టార్స్ త్వరలోనే చైనా వెళ్లనున్నారు. బాహుబలి 2 చైనీస్ వెర్షన్‌ని చైనాలో రిలీజ్ చేయనున్న 'ఈ స్టార్స్ ఫిలింస్' సంస్థ సీఈఓ ఎల

Advertiesment
చైనాలో బాహుబలి2 టీమ్! త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలు.. 4 వేల థియేటర్లలో విడుదల
హైదరాబాద్ , శనివారం, 17 జూన్ 2017 (06:23 IST)
సెప్టెంబర్‌లో చైనాలో రిలీజ్ కానున్న చైనీస్ వెర్షన్ ప్రమోషన్స్ కోసం ఈ బాహుబలి స్టార్స్ త్వరలోనే చైనా వెళ్లనున్నారు. బాహుబలి 2 చైనీస్ వెర్షన్‌ని చైనాలో రిలీజ్ చేయనున్న 'ఈ స్టార్స్ ఫిలింస్' సంస్థ సీఈఓ ఎల్లెన్ లీనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. చైనాలో దాదాపు 4,000 థియేటర్లలో బాహుబలి 2 సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు లీ తెలిపారు.
 
బాహుబలి 2 చైనీస్ వెర్షన్ దాదాపు 44.1 మిలియన్ డాలర్స్ వసూలు చేస్తుందని లీ అంచనా వేస్తున్నారు. తైవాన్, జపాన్, సౌత్ కొరియా దేశాల్లోనూ బాహుబలి 2 విడుదలయినట్టయితే... దంగల్ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ని బాహుబలి 2 అధిగమిస్తుందనే టాక్ వినిపిస్తోంది. అదే కానీ జరిగితే ఇప్పటికే ఇండియన్ స్టార్ అయిపోయిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి ఇక తిరుగులేనట్టే!
 
తెలుగు, తమిళం, హిందీ, మళయాళం భాషల్లో విడుదలైన బాహుబలి 2 సినిమా నిన్నటితో 50 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా రూ.1,684 కోట్లు వసూలుచేసిన ఈ సినిమా త్వరలోనే రూ.1,700 మార్క్‌ని అందుకోనుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ చిత్రాల గతిని మార్చిన బాహుబలి: తరుణ్ ఆదర్శ్.. రూ. 1700 కోట్ల వసూళ్లు.. చైనాలో సెప్టెంబర్‌లో విడుదల